హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఎంసెట్ దరఖస్తుల గడువు పొడిగింపు: అదనపు రుసుము లేకుండానే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ 2021 పరీక్షకు ఇప్పటి వరకు దరఖాస్తు చేయనివారికి ఇది శుభవార్తే. ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు పొడిగించారు. అంతేగాక, ఆలస్య రుసుము లేకుండా మే 26వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ జరుగుతుందని తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ ఫ్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు.

ఎంసెట్ పరీక్షలు జులై 5 నుంచి జులై 9 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) మోడ్‌లో జరగనున్నాయి. పరీక్షలు మొత్తం 9 సెషన్లలో జరుగుతాయి. అగ్రిక్లచర్ వారికి 3, ఇంజినీరింగ్ విద్యార్థులకు 5 సెషన్లు, మరో సెషన్ అవసరాన్ని బట్టి నిర్వహించాలనుకుంటున్నామని ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతాయి.

telangana eamcet application date extended may 26th

తెలంగాణలో కరోనా కేసులు

గత 24 గంటల వ్యవధిలో 62,591 నమూనాలను పరీక్షించగా.. 3961 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,32,784కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 30 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 2985కు చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం 631 కరోనా కేసులు నమోదయ్యాయి.

Recommended Video

Cyclone Tauktae : తుఫాన్ ఉగ్రరూపం Gujarat వద్ద తీరాన్ని, విషాదకర ఘటనలు...! || Oneindia Telugu

గత 24 గంటల్లో 5559 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 4,80,458కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 49,341 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 90.17 శాతం ఉంది. మరణాల రేటు 0.56 శాతంగా ఉంది.

English summary
telangana eamcet application date extended may 26th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X