హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మే 2న ఎంసెట్: 'ఏపీ విద్యార్థులకు తెలంగాణలో 15శాతం రిజర్వేషన్' (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 2016-17 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు ప్రవేశ పరీక్షల(సెట్స్‌) తేదీలను తెలంగాణ ఉన్నత విద్యామండలి మంగళవారం ప్రకటించింది. ఇంజినీరింగ్, వైద్య, వ్యవసాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఎంసెట్ 2016ను మే 2న నిర్వహించనున్నారు.

దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం ఉందని ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంసెట్ 2016 నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూహెచ్‌కు అప్పగించామన్నారు.

ఎడ్‌సెట్‌, ఐసెట్‌, లాసెట్‌తో పాటు పలు ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించారు. ఈమేరకు ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతను ఆయా వర్సిటీలకు అప్పగించారు. కన్వీనర్ల పేర్లను ఈ నెలాఖరులోగా యూనివర్సిటీలు ఉన్నత విద్యామండలికి పంపిన తర్వాతే నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన తెలియజేశారు.

జాతీయ, రాష్ట్రస్థాయిలో నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించే ఎంసెట్, ఇతర ప్రవేశపరీక్షలకు ఇబ్బందులు రాకుండా, తెలంగాణలో షెడ్యూలు ఖరారు చేశామని చెప్పారు. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జూన్ 2, 2014 అపాయింటెడ్ డే నుంచి పదేళ్ల వరకు ఉమ్మడి ప్రవేశాలు నిర్వహించాల్సి ఉందన్నారు.

అందులో భాగంగా ఏపీ విద్యార్థులకు 15 శాతం ఓపెన్ కోటాలో ప్రవేశాలు కల్పించాల్సి ఉందన్నారు. అందుకోసం టీఎస్ ప్రవేశ పరీక్షలకు ఏపీ విద్యార్థులు, ఏపీ ప్రవేశ పరీక్షలకు తెలంగాణ విద్యార్థులు పోటీలు పడే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

పరీక్షల తేదీల వివరాలు:

ఎంసెట్‌‌ను 02-05-2016వ తేదీన జేఎన్టీయూహెచ్ నిర్వహించనుంది. ఈసెట్‌‌ను 12-05-2016వ తేదీన జేఎన్టీయూహెచ్ నిర్వహించనుంది. ఐసెట్‌ను 19-05-2016వ తేదీన కాకతీయ యూనివర్సిటీ నిర్వహించనుంది. ఎడ్‌సెట్‌ను 27-05-2016వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. పీజీ ఈసెట్‌ను 29-05-2016వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. లా సెట్‌ను 24-05-2016వ తేదీన కాకతీయ యూనివర్సిటీ నిర్వహించనుంది. పీజీ ఎల్‌ సెట్‌ను 24-05-2016వ తేదీన కాకతీయ యూనివర్సిటీ నిర్వహించనుంది. పీఈ సెట్‌ను 11-05-2016వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది.

మే 2న ఎంసెట్

మే 2న ఎంసెట్


మే 19న ఐసెట్‌ను కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తుందని చెప్పారు. ఈ విధంగా మొత్తం ఎనిమిది రకాల ప్రవేశ పరీక్షల తేదీలను, వాటిని నిర్వహించే యూనివర్సిటీలను ఖరారు చేశామన్నారు. ప్రవేశ పరీక్షల వారీగా ఆయా యూనివర్సిటీలు, కన్వీనర్లను ఖరారు చేయాల్సి ఉందన్నారు.

మే 2న ఎంసెట్

మే 2న ఎంసెట్

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 2016-2017 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలను జూన్ 30లోగా పూర్తిచేసి, జూలై ఒకటినుంచి తరగతులు ప్రారంభించనున్నట్టు పాపిరెడ్డి చెప్పారు. ప్రవేశాల ప్రక్రియలో న్యాయపరమైన చిక్కులు లేకపోతే అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ప్రవేశాల ప్రక్రియను ముగిస్తామని తెలిపారు.
 మే 2న ఎంసెట్

మే 2న ఎంసెట్


ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీలద్వారా విద్యార్థులకు నైపుణ్యం పెంపొందించే విధంగా విద్యా విధానం అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని విద్యా మండలి చైర్మన్ పేర్కొన్నారు. అందుకోసం కాలేజీ యాజమాన్యాలు అన్ని ప్రమాణాలు పాటించాల్సిందేనని స్పష్టంచేశారు. నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.

మే 2న ఎంసెట్

మే 2న ఎంసెట్


అన్ని రకాల ఇంజినీరింగ్ కాలేజీలలో తనిఖీలు చేసి, నిబంధనలు పాటించిన కాలేజీలకే అఫిలియేషన్లు ఇవ్వడంపై యూనివర్సిటీలు దృష్టి సారించాయని చెప్పారు. ప్రమాణాలు పాటించని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలలో కొన్ని స్వచ్ఛందంగా మూసివేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. మరికొన్ని కాలేజీలలో భారీ సంఖ్యలో కోర్సులు, సీట్ల సంఖ్య కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నామని పాపిరెడ్డి తెలిపారు.

English summary
he Jawaharlal Nehru Technological University Hyderabad (JNTUH) will hold Eamcet on May 2, informed Papi Reddy, chairman of Telangana State Council of Higher Education (TSCHE) at a press conference on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X