telangana elections: ప్రలోభాలు షురూ.. ఆ కిట్లను పంచుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ కు కొద్ది రోజుల సమయం ఉంది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచే ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టాయి. అధికార బిఆర్ఎస్ పార్టీ అయితే ఏకంగా ప్రలోభాల పర్వానికి శ్రీకారం చుట్టింది .
ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. తాజాగా వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ సర్పంచ్ ఇంట్లో ఓటర్లకు పంచేందుకు చీరలు, టిఫిన్ బాక్సులు, బ్యాగులు సిద్ధం చేశారు. ఇక సమాచారం అందుకున్న ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ దాడులు నిర్వహించింది.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సోమవారం గ్రామంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి గ్రామ సర్పంచి రాపాక రేణుక, నాగయ్య ఇంట్లో వాటర్ బాటిల్స్ , లంచ్ బాక్స్ లు, బ్యాగ్స్ నిలువ చేశారని విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్నికల స్పెషల్ ఫ్లయింగ్ స్కాడ్ అధికారులు దాడులు నిర్వహించి బిఆర్ఎస్ పార్టీకి చెందిన 180 వాటర్ బాటిల్స్ ,280 బ్యాగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ బ్యాగుల పైన వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఫోటో లోగోలు ఉన్నాయి. కేసు నమోదు నిమిత్తం పర్వతగిరి పోలీసులకు అప్పగించినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్ బాబురావు తెలిపారు.పార్టీకి సంబంధించిన వస్తువులు ఎవరైనా సరే ఇండ్లలో నిల్వ ఉంచుకుంటే ఎలక్షన్ కోడ్ కు సంబంధించి కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నగదు పట్టుబడుతోంది. పోలీసుల తనిఖీలలో ఎక్కడపడితే అక్కడ డబ్బులు ఇప్పటికే పట్టుబడుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 40 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు ఎన్నికల అధికారులు. మొత్తంగా చూస్తే ఈసారి ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో ప్రలోభాల పర్వం ఈసారి జోరుగానే కొనసాగే అవకాశం ఉంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications