ధూంధాం గా తెలంగాణా అవతరణ దశాబ్ది వేడుకలు.. 21రోజుల పాటు.. షెడ్యూల్ ఇదే!!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం దశాబ్ధి ఉత్సవాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలను జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని రోజువారీ కార్యక్రమాలు షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈసారి దశాబ్ది ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, తెలంగాణ రాష్ట్ర సాధన నాటి జ్ఞాపకాలను ప్రజలకు తెలియజెప్పేలా, తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి అందరికీ తెలియజేసేలా జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు కార్యక్రమాల షెడ్యూల్ రూపొందించి కార్యాచరణకు సంబంధించి రేపు జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్.

మొత్తం 21రోజుల పాటు జరిగే కార్యక్రమాలలో భాగంగా జూన్ 2వ తేదీన జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ 2న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. అనంతరం ఉత్సవ సందేశం ఇస్తారు.
ఈ రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ, దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. జూన్ 3వ తేదీన తెలంగాణ రైతు దినోత్సవం నిర్వహిస్తారు. జూన్ 4వ తేదీన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సురక్ష దినోత్సవం నిర్వహిస్తారు. జూన్ 5వ తేదీన తెలంగాణ విద్యుత్ విజయోత్సవాన్ని నిర్వహిస్తారు. సింగరేణి సంబరాలు కూడా జరుపుతారు. జూన్ 6వ తేదీన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
జూన్ 7వ తేదీన సాగునీటి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. జూన్ 8వ తేదీన ఊరూరా చెరువుల పండుగను, జూన్ 9వ తేదీన తెలంగాణ సంక్షేమ సంబరాలను నిర్వహిస్తారు. జూన్ పదవ తేదీన సుపరిపాలన దినోత్సవంగా జిల్లా స్థాయిలో కవిసమ్మేళనాలు, రాష్ట్రస్థాయి కవిసమ్మేళనాలు నిర్వహిస్తారు. జూన్ 11వ తేదీన తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
12వ తేదీన తెలంగాణ రాష్ట్రం పేరిట అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం 6 గంటలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, యువతతో రన్ నిర్వహిస్తారు. జూన్ 13వ తేదీన తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవాన్ని, జూన్ 14వ తేదీన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ దినోత్సవాన్ని, జూన్ 15వ తేదీన తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
జూన్ 16వ తేదీన పట్టణ ప్రగతి దినోత్సవాన్ని, జూన్ 17వ తేదీన తెలంగాణ గిరిజన ఉత్సవాన్ని, జూన్ 18వ తేదీన తెలంగాణ మంచినీళ్ల పండుగను నిర్వహిస్తారు. జూన్ 19వ తేదీన తెలంగాణ హరిత ఉత్సవాన్ని, జూన్ 20వ తేదీన తెలంగాణ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. జూన్ 21వ తేదీన తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవాన్ని, జూన్ 22వ తేదీన తెలంగాణ అమరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
హైదరాబాద్లో అమరుల గౌరవార్థం ట్యాంక్ బండ్ పై కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని కెసిఆర్ అదే రోజున ఆవిష్కరిస్తారు. ఇలా మొత్తం 21 రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో ధూమ్ ధామ్ గా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications