Dusshera Holidays: తెలంగాణాలో స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులివే...!
దసరా పండుగ వచ్చేస్తోంది. సంబరాలకు రంగం సిద్దమవుతోంది. అదే సమయంలో స్కూల్స్, కాలేజీలకు దసరా సెలవలపై ప్రకటన కూడా వచ్చేసింది. తెలంగాణలో అన్ని పాఠశాలలు, కళాశాలలకూ ఈసారి దసరా సెలవులు ఎప్పుడన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. ఈ మేరకు అధికారులు ఇవాళ కీలక ప్రకటన విడుదల చేసారు. స్కూళ్లకు, కాలేజీలకు వేర్వేరుగా సెలవుల్ని ఖరారు చేస్తూ అధికారులు ప్రకటన చేశారు.
తెలంగాణలో ఈసారి దసరా సెలవుల్ని స్కూళ్లకు, కాలేజీలకు వేర్వేరుగానే ప్రకటించారు. ఇందులో ముందుగా స్కూళ్లకు దసరా సెలవుల్ని ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకూ ప్రకటించారు. అలాగే కాలేజీలకు మాత్రం ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకూ ప్రకటించారు. దీంతో ఆయా స్కూళ్లు, కాలేజీల విద్యార్దుల్ని వీటిని గమనించి సెలవులకు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.

తెలంగాణ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం కోసం ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఈ సెలవుల్ని ఇస్తున్నారు. స్కూళ్లకు సెలవులు అక్టోబర్ 3 వరకూ ఇవ్వడంతో 4వ తేదీన విద్యార్ధులకు తిరిగి పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. జూనియర్ కాలేజీలకు మాత్రం అక్టోబర్ 5 వరకూ సెలవులు ప్రకటించడంతో అక్టోబర్ 6న వారు తిరిగి కాలేజీలకు రావాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు స్కూళ్లు, కాలేజీలకు క్లారిటీ ఇస్తున్నారు. అలాగే సెలవుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా అధికారులు పలు సూచనలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications