దసరా ప్రత్యేక బస్సులలో.. మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందా?

పండుగలు ఏవైనా బస్సు, రైలు రవాణా సాధనాలు ప్రజలను తాము వెళ్లాలనుకునే ప్రాంతాలకు సురక్షితంగా చేరవేస్తాయి. సంక్రాంతి, దసరా వంటి పెద్ద పండుగలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రతీ ఏడాది నడుపుతుంది. ఈ క్రమంలో ఈ సంవత్సరం కూడా దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భారీ ఏర్పాట్లు చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,000 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. కరీంనగర్ జోన్ నుంచి 3,533, హైదరాబాద్ జోన్ నుంచి 2,155, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,312 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. రీజియన్ల వారీగా ఆదిలాబాద్ నుంచి 431, నిజామాబాద్ నుంచి 719, కరీంనగర్ నుంచి 1,175, వరంగల్ నుంచి 530, ఖమ్మం నుంచి 678 బస్సులు నడుపుతారు.

TGSRTC to Run 7 000 Special Buses for Dussehra Higher Fares on Peak Days clarity on Free Travel for Women

హైదరాబాద్ జోన్‌లో మహబూబ్‌నగర్ నుంచి 645, మెదక్ నుంచి 255, నల్గొండ నుంచి 815, రంగారెడ్డి నుంచి 440 బస్సులు ఉంటాయి. అక్టోబర్ 9, 10, 16, 17 తేదీల్లో ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్న క్రమంలో ఆ రోజుల్లో ప్రత్యేక బస్సులు నడపనుంది. తిరుగు ప్రయాణాలకు అక్టోబర్ 25, 26 తేదీల్లో కూడా ప్రత్యేక బస్సులు నడుపుతారు.

ఈ ఆరు రోజుల్లో ప్రత్యేక బస్సులకు సాధారణ ఛార్జీ కంటే 1.5 రెట్లు పెరిగిన ధరలు వర్తిస్తాయి. రెగ్యులర్ బస్సుల్లో మాత్రం సాధారణ ఛార్జీలే ఉంటాయి. అయితే ఈ సమయంలో ఉచిత బస్సు ప్రయాణం వర్తిస్తుందా లేదా అన్నది చాలామంది ప్రయాణికులకు ఆందోళన కలిగిస్తున్న అంశం. అయితే ఈ అనుమానంపై ఆర్టీసీ ప్రయాణికులకు క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దసరా సమయంలో కూడా కొనసాగుతుందని టీజీఎస్ ఆర్టీసీ పేర్కొంది.

కేబీఆర్ పార్క్ ఎలివేటేడ్ కారిడార్ కోసం కోట్ల విలువైన ఇంటి స్థలం ఇస్తున్న బాలకృష్ణ!
కేబీఆర్ పార్క్ ఎలివేటేడ్ కారిడార్ కోసం కోట్ల విలువైన ఇంటి స్థలం ఇస్తున్న బాలకృష్ణ!

పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ మరియు ప్రత్యేక సర్వీసుల్లోనూ ఈ సౌకర్యం వర్తిస్తుందని టీజీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వై. నాగిరెడ్డి స్పష్టం చేశారు.
ప్రయాణికులు రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందస్తు బుకింగ్ చేసుకోవడం మంచిదని సూచించారు. టీజీఎస్‌ఆర్‌టీసీ వెబ్‌సైట్ www.tgsrtcbus.in ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రధాన బస్టాండ్లలో తాత్కాలిక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+