హైదరాబాద్ లో బాగా డిమాండ్ ఉన్న టాప్10 ఉద్యోగాలివే.. లింక్డ్ఇన్ నివేదిక!

ప్రస్తుతం జాబ్ మార్కెట్ ఎంత విస్తృతమైన పరిధిని కలిగి ఉన్నప్పటికీ, ఒక పోస్టుకు వెయ్యి మంది చొప్పున పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. అంటే అంతే స్థాయిలో నిరుద్యోగులు కూడా ఉన్నారు. మారుతున్న కాలంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్న వారు ప్రపంచంలో పరుగులు పెడుతున్నారు. ఇక ముఖ్యంగా హైదరాబాద్ ఐటి మరియు ఏఐ హబ్ గా వేగంగా అభివృద్ధి చెందుతోంది.

టాప్ 1లో ఈ ఉద్యోగాలకు డిమాండ్
జిసిసిలు, స్టార్టప్ లు పెరుగుతున్నాయి. దీంతో ఏఐ, సాఫ్ట్వేర్, గ్రీన్ ఎనర్జీ ఉద్యోగాలకు భారీగా డిమాండ్ నెలకొంది. ఇక హైదరాబాద్ జాబ్ మార్కెట్లో లింక్డ్ ఇన్ జాబ్స్ ఇన్ ద రైజ్ 2026 ప్రకారం టాప్ టెన్ డిమాండ్ ఉన్న ఉద్యోగాలను నివేదించింది. ప్రస్తుతం మనం ఆ ఉద్యోగాలను తెలుసుకుందాం. ఏఐ టూల్స్ కి సరైన సూచనలను రూపొందించే ప్రాంప్ట్ ఇంజనీర్లు టాప్ వన్ ప్లేస్ లో ఉన్నారు.

These are the top 10 most in-demand jobs in Hyderabad according to a LinkedIn report

టాప్ 5లో డిమాండ్ ఉన్న ఉద్యోగాలివే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్టుల పై పనిచేసే ఏఐ ఇంజనీర్లు టాప్ టు లో ఉన్నారు. యాప్ లు, వెబ్ ప్లాట్ ఫాం లు, సిస్టం డెవలప్మెంట్ పనులు చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మూడవ స్థానంలో ఉన్నారు. ఏఐ ప్రాజెక్టులను నిర్వహిస్తూ, అమలుచేసే ఏఐ మేనేజర్లు నాలుగవ స్థానంలోనూ, కంపెనీల వ్యాపార అభివృద్ధికి వ్యూహాలు సూచించే స్ట్రాటజిక్ అడ్వైజర్ లు ఐదవ స్థానంలోనూ ఉన్నారు.

హైదరాబాద్ జాబ్ మార్కెట్ లో వీరికి డిమాండ్
డిజిటల్ మార్కెటింగ్ యాడ్స్, కొనుగోలు, క్యాంపెయిన్ ప్లానింగ్ చేసే ఉద్యోగం వంటివి చేసే మీడియా బయ్యర్లు ఆరవ స్థానంలో, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలపై దృష్టి పెట్టి ఉద్యోగాలు చేసే సేల్స్ స్పెషలిస్టులు ఏడవ స్థానంలో ఉన్నారు. 8వ స్థానంలో మానసిక ప్రవర్తన సమస్యల పరిష్కారానికి సంబంధించిన ఉద్యోగాలు చేసే బిహేవియర్ థెరపిస్టులు ఉన్నారు.

లింక్దిన్ నివేదిక ప్రకారం టాప్ 10 డిమాండ్ ఉన్న ఉద్యోగాలివే
పశు వైద్యం, యానిమల్ హెల్త్ కేర్ రంగంలో పనిచేసే వెటర్నరీ డాక్టర్లు 9వ స్థానంలో ఉన్నారు ఆపై సోలార్ ఎనర్జీని డిజైన్ చేసి ప్లానింగ్ చేసి అమలు చేసే నిపుణులు అయిన సోలార్ కన్సల్టెంట్లు 10వ స్థానంలో ఉన్నారు. ఇది హైదరాబాద్ లో ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న లింక్డ్ ఇన్ నివేదించిన టాప్ టెన్ ఉద్యోగాలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+