ఓటేసిన నాగార్జున ఫ్యామిలీ, అల్లు అరవింద్; రాజమౌళి దంపతులతో పాటు పలువురు సినీ హీరోలు!!

తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల పండుగ కొనసాగుతోంది. ఈరోజు ఓట్ల పండుగలో ఓట్లు నమోదు చేస్తున్న ఓటర్లు ఎన్నికల బరిలో ఉన్న 2290 మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యాన్ని తేల్చనున్నారు. దీంతో అభ్యర్థులలో ఆందోళన నెలకొంది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలకు సినీ ప్రముఖులు అత్యంత ప్రాధాన్యత నిచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ప్రముఖ సినీ నటుడు, నిర్మాత అక్కినేని నాగార్జున ఈరోజు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య అమల, పెద్ద కుమారుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి క్యూలైన్‌లో నిలబడి ఓటు వేశారు. అక్కినేని నాగార్జున కుటుంబం నేడు జూబ్లీహిల్స్ లోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఓటు వేసి ప్రతీ ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని, అది అందరి బాధ్యత అన్నారు.

tollywood celebrities nagarjuna, allu arvind, rajamouli vote in telangana election polling

రానా దగ్గుపాటి హైదరాబాద్లోని ఎఫ్ ఎన్ సి సి వద్ద తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక సినీ నటులు విజయ్ దేవరకొండ, రవితేజ, నాని, రామ్ పోతినేని, సాయిధరమ్ తేజ్, బలగం హీరోయిన్ కావ్య, దర్శకుడు సుకుమార్, నితిన్, ఎస్ఎస్ రాజమౌళి దంపతులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాఘవేంద్రరావు కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

వెటరన్ యాక్టర్ జగపతిబాబు ఫిలింనగర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ సినీ కమెడియన్ బ్రహ్మానందం కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లోని bsnl సెంటర్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నెంబర్ 153 లో అల్లు అరవింద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ పోలింగ్ కేంద్రంలో స్టైలిష్ స్టార్ స్టార్ అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకోగా, అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి, హీరో అల్లు శిరీష్ లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం అల్లు అరవింద్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని హాలిడే కదా అని బీరు తాగి ఇంట్లో పడుకునే వారు చాలామంది ఉన్నారని, అలా చేస్తే ఆ తర్వాత ఎమ్మెల్యేలను ప్రశ్నించే హక్కు ఉండదని, అందరూ లేచి వచ్చి ఓటు వేయాలని అల్లు అరవింద్ గుర్తు చేశారు. మనకు ఈ ప్రభుత్వం ఏమి ఇస్తుంది అని అనుకోవద్దని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, దేశం కోసం ఓటు వేయాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+