'కాటమరాయుడు'కు కేటీఆర్ కితాబు, 'పిక్' వైరల్, 2019 సీఎంలు అంటూ..

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో పవన్‌తో ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు.

ఈ రోజు తాను కాటమరాయుడు సినిమాను చూశానని పేర్కొన్నారు. ఒక సినిమా ద్వారా ఖాదీ వస్త్రాలకు ప్రచారం కల్పించడం అభినందనీయమని ప్రశంసించారు. పవన్ ష్యూర్ విన్నర్ అని చెప్పారు.

కాగా, పవన్ కళ్యాణ్‌తో కలిసి ఉన్న తన పిక్‌ను కేటీఆర్ పెట్టడంతో.. దానికి పెద్ద ఎత్తున రీట్వీట్లు వస్తున్నాయి. ఇరువురు నేతలను చాలామంది ప్రశంసిస్తున్నారు.

'ఒక పిక్‌లో ఇద్దరు డైనమిక్ లీడర్స్', 'ఈ ట్వీట్ వైరల్ అవుతుంది', 'ఈ పిక్‌లో నా ఫేవరేట్ రియల్ హీరోలు', 'రెండు రాష్ట్రాలకు కాబోయే సీఎంలు', 'ఒక మంచి పని కోసం ఇద్దరు యువ నాయకుల కలయిక.. చేనేత వస్త్రాల కోసం సూపర్', '2019లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీరు', 'తెలంగాణ కింగ్, ఏపీ-టీఎస్ కింగ్', 'ఇది కద మాకు కావాల్సిన ఎమోషన్', 'కన్నుల విదు' అంటూ పెద్ద ఎత్తున రీట్వీట్లు వస్తున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
'Watched PawanKalyan KatamaRayudu. You have a sure winner Kalyan & sharrath_marar Appreciate the subtle but strong promotion of Handlooms' KTR in Tweet
Please Wait while comments are loading...