TSRTC: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు రిజర్వుడ్ సీట్లు ? ఎన్నో తెలుసా !
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమంటూ కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీ ఆ పార్టీని అధికారంలోకి ఉపయోగపడింది కానీ, ఇప్పుడు ఆర్టీసీకి చుక్కలు చూపిస్తోంది. నానాటికీ పెరుగుతున్న మహిళల ఉచిత ప్రయాణాలతో రేవంత్ రెడ్డి సర్కార్ కు జనంలో ఆదరణ పెరుగుతున్నా ఆ మేరకు ఆర్టీసీపై ఒత్తిడి పెంచేస్తోంది. దీంతో ఒకప్పుడు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో రిజర్వ్ చేసిన సీట్లు కాస్తా ఇప్పుడు పురుషులకు కేటాయించాల్సిన పరిస్దితి వచ్చేస్తోంది.
ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాలతో పెరుగుతున్న రద్దీతో పురుషులు బస్సెక్కే పరిస్ధితులు లేకుండా పోతున్నాయి. చాలా చోట్ల మహిళలు భారీ ఎత్తున బస్సు ప్రయాణాలకు మొగ్గుచూపుతుండటంతో పురుషులకు సీట్లు దొరకడం లేదు. అలాగని మహిళలని బస్సు ఎక్కొద్దని చెప్పలేరు. దీంతో ఒకప్పుడు మహిళలకు కేటాయించినట్లుగానే ఇప్పుడు పురుషులక బస్సుల్లో రిజర్వుడ్ సీట్లు కేటాయించే అంశాన్నీ ఆర్టీసీ తీవ్రంగా పరిశీలిస్తోంది.

మహిళల తరహాలోనే ఇప్పుడు పురుషులకు సీట్లు రిజర్వ్ చేస్తే ఎలా ఉంటుందోననే అంశాన్ని ఆర్టీసీ అధికారులు ఆలోచిస్తున్నారు. ఇందుకోసం ప్రతీ బస్సులోనూ మొత్తం 55 సీట్లలో 20 సీట్లు రిజర్వ్ చేస్తే ఎలా ఉంటుందని పరిశీలిస్తున్నారు.ఈ మేరకు అన్ని డిపోల నుంచి అధికారులు సమాచారం కోరారు. ముఖ్యంగా డిపో మేనేజర్ల అభిప్రాయాలను ఉన్నతాధికారులు సేకరిస్తున్నారు. ఈ సమాచారం అంతా వచ్చాక పురుషులకు రిజర్వుడు సీట్లపై నిర్ణయం తీసుకుంటారు.
మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు ఇలా ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తే వ్యతిరేకత వస్తుందా అనే ఆందోళన కూడా అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే దేశంలో ఇప్పటివరకూ మహిళలకే తప్ప పురుషులకు ఇలా సీట్లు రిజర్వ్ చేసిన దాఖలాలు లేవు. అటు టిక్కెట్ కొన్న తమకు సీట్లు లేకపోతే ఎలా అంటూ ఇప్పటికే పురుషులు అభ్యంతరాలు చెప్తున్నారు. పరిస్దితి ఇలాగే కొనసాగితే పురుష ప్రయాణికులకూ, మహిళా ప్రయాణికులూ మధ్య వాగ్యుద్ధాలు తప్పేలా లేవు. అందుకనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications