పాత్రికేయులకు అండ.!జర్నలిస్టులకు పెద్ద ఎత్తుల కరోనా సాయం అందించామన్న అల్లం నారాయణ.!
హైదరాబాద్ : జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. అనారోగ్యం తలెత్తినప్పుడు ఆర్థకంగా అండగా ఉండటమే కాకుండా కరోనా వంటి మహమ్మారి బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థికంగా సహాయం చేస్తూ జర్నలిస్టుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ జర్నలిస్టులకు ప్రభుత్వానికి మద్య మంచి సమన్వయ బాద్యతలను నిర్వహిస్తూ పాత్రికేయుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ వినూత్న సేవలందిస్తున్నారు సీనియర్ పాత్రికేయులు, తెలంగాణ మీడియా అకాడమి ఛైర్మన్ అల్లం నారాయణ.

కోవిడ్ బారిన పడ్డ జర్నలిస్తులకు భరోసా.. ఆర్థిక సాయం చేసిన ప్రభుత్వం
తెలంగాణ మీడియా అకాడమి తెలంగాణ జర్నలిస్టులకు అందించిన కోవిడ్ ఆర్థిక సహాయం మొత్తం 5 కోట్ల 56 లక్షల 30 వేల రూపాయలకు చేరిందని, దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా కోవిడ్ బారిన పడిన జర్నలిస్టులను తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ మీడియా అకాడమి ఆదుకున్నదని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. కరోనా తగ్గు ముఖం పడ్తున్న సమయంలో కూడా నాలుగు నెలల కాలంలో ఇప్పటికీ 77 మంది కరోనా బారిన పడిన వారికి 7 లక్షల 70 వేల రూపాయలు మంగళవారం బ్యాంకులో జమ చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 3909 మంది జర్నలిస్టులకు కరోనా సాయం అందించామని అల్లం నారాయణ తెలిపారు.

మీడియా అకాడెమీ ద్వారా ఆర్థిక సాయం.. జర్నలిస్టులకు ధైర్యం కల్పించామన్న అల్లం నారాయణ
అంతే కాకుండా రాష్టంలోని అన్నిరంగాలను ప్రభావితం చేసిన కరోనా మహమ్మారి జర్నలిస్టులపై కూడా తీవ్రంగా ప్రభావం చూపిందని, దాని ద్వారా నిత్యం విధి నిర్వమణలో ఉండే జర్నలిస్టులు అనేక ఇబ్బందులపాలయ్యరని అల్లం నారాయణ ఆవేదన వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం - శిక్షణ కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి జర్నలిస్టులకు ఎదురైన కరోనా ఇబ్బందులను కొద్ది మేరకైనా తొలగించడానికి ప్రయత్నం చేసిందని అల్లం నారాయణ స్పష్టం చేసారు.

కరోనా తొలివిడతలో పెద్ద ఎత్తున సాయం.. రెండో దశలో రెట్టింపు సాయం అందించామన్న నారాయణ
అందులో భాగంగా ఇప్పటి వరకు కరోనా సోకిన 3909 మంది జర్నలిస్టులకి 5 కోట్ల 56 లక్షల 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిందని మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. తొలి విడత కరోనా సమయంలో దరిదాపు 1553 మంది కరోనా సోకిన జర్నలిస్టులకి 3 కోట్ల 10 లక్షల 60 వేల రూపాయలను కరోనాతో హోంక్వారంటైన్ లో ఉన్న జర్నలిస్టులకు 87 మందికి 8 లక్షల 70 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించామన్నారు. రెండవ విడత కరోనా తీవ్ర ఉధృతి కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే దాదాపు 2269 మంది జర్నలిస్టులకి కరోనా సోకిందని అల్లం నారాయణ తెలిపారు.
Recommended Video

ఏ రాష్ట్రం కూడా జర్నలిస్టులకు ఇంత సాయం చేయలేదు.. టీ సర్కార్ పై అల్లం నారాయణ ప్రశంసలు
ఇక మలి విడత ఆర్థిక సహాయం 10 వేల వంతున 2269 మంది జర్నలిస్టులకి రెండు కోట్ల 26 లక్షల 90 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించామని అల్లం నారాయణ వివరించారు. దీంతో వెరసి మీడియా అకాడమిలో ఉన్న 42 కోట్ల కార్పస్ ఫండ్ తో వచ్చిన వడ్డీ ఆధారంగా ఈ మొత్తాలను జర్నలిస్టులను ఆదుకోవడానికి అకాడమి వినియోగించిందని, తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా కూడా కరోనా సోకిన జర్నలిస్టులకు ఇలా ఆర్థిక సహాయం అందలేదని, ఇది తెలంగాణ ప్రభుత్వం చేసిన ఒక గొప్ప పనిగా మీడియా అకాడమి భావిస్తున్నట్ల అల్లం నారాయణ హర్షం వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications