వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోహిత్ ఫ్యామిలీకి హెచ్‌సీయూ రూ. 8లక్షలు ఎక్స్‌గ్రేషియా: వర్సిటీకి జేడీయూ ఎంపీలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్‌డీ విద్యార్థి వేముల రోహిత్ కుటుంబానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) శుక్రవారం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు రోహిత్ బంధువులకు వర్సిటీ రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసింది.

రోహిత్ తల్లి రాధికకు ఇందుకు సంబందించిన డీడీని అధికారులు అందజేశారు. కాగా, రోహిత్ మృతిపై విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం కూడా యూనివర్సిటీ ఆవరణలో విద్యార్థులు ఆందోళనలు నిర్వహించారు. రోహిత్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

హెచ్‌సియూకి వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు వచ్చి రోహిత్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, యూనివర్సిటీ వీసీ అప్పారావు.. అన్ని సమస్యలపై చర్చలు జరుపుదామని విద్యార్థులకు పిలుపునిచ్చారు. దీంతో పలువురు విద్యార్థులు, అధ్యాపకులు చర్చలు జరిపారు.

జేడీయూ ఎంపీల సందర్శన

హెచ్‌సీయూలో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్యకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన దీక్షలకు మద్దతు కొనసాగుతోంది. ఈరోజే జేడీయూ ఎంపీలు త్యాగి, పవన్‌ వర్మ విద్యార్థుల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయను మంత్రివర్గం నుంచి తొలగించాలన్నారు. దీనిపై పార్లమెంటులో తాము పోరాటం చేస్తామన్నారు.

వర్సిటీలో జేడీయూ ఎంపీ త్యాగి

వర్సిటీలో జేడీయూ ఎంపీ త్యాగి

హెచ్‌సీయూలో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్యకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన దీక్షలకు మద్దతు కొనసాగుతోంది. ఈరోజే జేడీయూ ఎంపీలు త్యాగి, పవన్‌ వర్మ విద్యార్థుల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు.

పెయింటింగ్స్

పెయింటింగ్స్

ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్‌డీ విద్యార్థి వేముల రోహిత్ కుటుంబానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) శుక్రవారం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు రోహిత్ బంధువులకు వర్సిటీ రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసింది.

నిరసన ర్యాలీ

నిరసన ర్యాలీ

రోహిత్ తల్లి రాధికకు ఇందుకు సంబందించిన డీడీని అధికారులు అందజేశారు. కాగా, రోహిత్ మృతిపై విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

నిరసన ర్యాలీ

నిరసన ర్యాలీ

శుక్రవారం కూడా యూనివర్సిటీ ఆవరణలో విద్యార్థులు ఆందోళనలు నిర్వహించారు. రోహిత్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

English summary
The University of Hyderabad has announced an ex-gratia of Rs.8 lakh to the bereaved family of Rohith Vemula Chakravarti, who committed suicide on the campus on January 17, creating a nationwide furore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X