ఉప్పల్ నరబలి: కేసులో కొత్త మలుపు?.. ఏది నిజం?.. అసలేం జరుగుతోంది..
హైదరాబాద్:
ఉప్పల్
నరబలి
కేసు
ఇంకా
ఓ
కొలిక్కి
రాలేదు.
పైగా
జరిగింది
అసలు
నరబలేనా?..
లేక
ఏదైనా
జంతువు
చిన్నారి
తలను
లాక్కొచ్చి
అక్కడ
పడేసిందా?
అన్న
కొత్త
అనుమానాలు
కూడా
తెరపైకి
వస్తున్నాయి.
Recommended Video

ఉప్పల్
నరబలి:
తెరపైకి
కొత్త
అనుమానం..,
ఫోరెన్సిక్
ల్యాబ్‌కు
చిన్నారి
తల
భాగం!
ఒకవేళ చిన్నారిది నరబలి కాకపోతే తల మాత్రం అక్కడికెలా వచ్చింది? అన్నది అంతుపట్టడం లేదు. ఇదే విషయంపై గత రెండు రోజులుగా తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఏ చిన్న ఆధారాన్ని పోలీసులు విడిచిపెట్టడం లేదు. నరబలి కేసుగా అనుమానాలు పెరగడంతో.. క్షుద్ర పూజల తీరుపై పలువురు పూజారులను కూడా దీనికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఉప్పల్
నరబలి:
వెలుగులోకి
మరిన్ని
సంచలనాలు..
ఆర్నెళ్లుగా
వాళ్లతో
టచ్‌లో
రాజశేఖర్?

71 మందిని విచారించిన పోలీసులు:
చిన్నారి మొండెం లభిస్తేనే కేసులో చిక్కుముడి వీడుతుందని పోలీసులు భావిస్తున్నారు. మొండాన్ని చిలుకానగర్ లక్ష్మీ ఇండస్ట్రీస్ ప్రాంతంలో పడేసినట్టు తొలుత ప్రచారం జరిగినప్పటికీ.. అందులో నిజానిజాలు ఇంకా నిర్దారణ కాలేదు.
ఈ నేపథ్యంలో డీసీపీ ఉమామహేశ్వరశర్మ ఆధ్వర్యంలోని పోలీస్ బృందం శుక్రవారం చిలుకానగర్‌లో మరోసారి ఆధారాలను సేకరించింది. ఇప్పటివరకు 71 మంది సాక్షులు, అనుమానితులను విచారించినప్పటికీ.. ఇంకా కేసుపై ఓ స్పష్టతకు రాలేకపోయామని తెలిపారు.

2,3 రోజుల క్రితమే హత్య..:
క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ ఇంటిపై శిశువు తల పడి ఉన్న తీరు, రక్తం గడ్డకట్టిన చోటు, ఒక మీటర్ పరిధిలో అక్కడ గుర్తించిన ఆనవాళ్లను హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల ఆధారాల బృందం సేకరించింది.
శిశువు రక్త నమూనాలు ఏ గ్రూపుకు చెందినదో నిర్దారించేందుకు డీఎన్‌ఏ పరీక్షలకు పంపించారు. కాగా, తల నుంచి వాసన రావడం, రక్తం గడ్డకట్టి ఉండటంతో.. రెండు, మూడు రోజుల క్రితమే ఆ శిశువు తల అక్కడ పడి ఉంటుందని భావిస్తున్నారు.

జంతువులే చంపేశాయా?:
ఇది నరబలేనా?.. లేక ఏదైనా జంతువు చిన్నారిని పీక్కు తినడానికి ప్రయత్నించిందా?.. అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకోసం చిన్నారి గొంతు వద్ద ఉన్న రక్తనాళాలను పరిశీలించారు. అయితే తలను వేరు చేయడానికి గట్టిగా లాగినట్టు గుర్తులు కనిపించడంతో.. జంతువులు చంపేసి ఉంటాయా? అన్న కోణంలోనూ ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.

నరబలి వివరాలు సేకరించిన పోలీసులు..:
ఒకవేళ జంతువులే చిన్నారిని చంపేసి ఉంటే.. తల భాగం మాత్రమే ఆ ఇంటి పైకి ఎలా వచ్చిందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నరబలికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు పలు ఆలయ పూజారులను కూడా పిలిపించి వివరాలు సేకరించారు. నరబలి కోసం హోమం చేస్తారని, రక్తాన్ని పొలిలా చల్లుతారని, పసుపు, కుంకుమ, రక్తం వంటివి కచ్చితంగా ఉపయోగిస్తారని పూజారులు వెల్లడించారు.

ఆ ఆనవాళ్లేవి?:
పూజారులు చెప్పిన ప్రకారం చూస్తే.. రాజశేఖర్ ఇంట్లో ఎక్కడ పసుపు, కుంకుమ ఆనవాళ్లు లభించకపోవడం గమనార్హం. అయితే పసుపు, కుంకుమ ఆధారాలు లేకుండా ఏమైనా జాగ్రత్తపడ్డారా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. చిన్నారి తల, వెంట్రుకలు, నోరు, చెవుల లోపల కూడా అత్యాధునిక సాంకేతిక పరికరాలతో క్షుణ్ణంగా పరిశీలించినట్టు తెలుస్తోంది. అయితే అక్కడ కూడా పసుపు, కుంకుమ ఆనవాళ్లేమి కనిపించకపోవడం గమనార్హం.

ఎవరీ చిన్నారి?:
చిన్నారి ఎవరన్న విషయం గనుక తేలి ఉంటే.. నరబలి కేసు విచారణ సులువయ్యేదని పోలీసులు భావిస్తున్నారు. చిన్నారి నరబలి విషయం ఇంత పెద్ద ఎత్తున ప్రచారమైన తర్వాత కూడా ఇంతవరకు శిశువు తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ పోలీసులను ఆశ్రయించకపోవడం గమనార్హం. దర్యాప్తులో భాగంగా చాలామందిని విచారించినప్పటికీ పెద్దగా సమాచారం రాబట్టలేకపోయామని పోలీసులు వెల్లడించారు. ఫోరెన్సిక్ టెస్టుల ద్వారానే స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.