హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భోజన సదుపాయం ఇలా?: కేసీఆర్ ఫాంహౌస్ నుంచే కూరగాయలు, పూలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: లోక కల్యాణం కోసం మెదక్‌జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ తలపెట్టిన అయుత మహా చండీయాగాన్ని అత్యంత నిమయనిష్టలతో రుత్విక్కులు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆయుత చండీయాగానికి రుత్విక్కులు ఎంతో కీలకం. ఈ ఆయుత చండీయాగం చేసే సమయంలో రుత్విక్కులు ఎలాంటి నియమనిబంధనలు పాటిస్తారో ఒక్కసారి తెలుసుకుందాం.

చండీయాగం ప్రారంభం నుంచి పరిసమాప్తి వరకు ప్రతి ఒక్కరూ ఒకపూట మాత్రమే భోజనం చేస్తారు. యాగశాలలో మంచినీళ్లు కూడా ముట్టరు. రెండు పూటలా స్నానమాచరిస్తారు. దీక్షా వస్త్రాలను మాత్రమే ధరిస్తారు. దీక్షాబద్ధులు యాగం జరిగే ప్రాంతాన్ని విడిచి వెళ్లరు.

Photos: కెసిఆర్ ఆయుత చండీయాగం

భోజన సదుపాయం ఇలా:
అత్యంత నిష్టతో యాగాన్ని చేసే వీరికి రుచికరమైన ప్రత్యేకమైన భోజన వసతులు ఏర్పాటు చేశారు. వంటల కోసం ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నుంచి 40 మంది బ్రాహ్మణోత్తములను ప్రత్యేకంగా రప్పించారు. వడ్డించడం కోసం ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి 120 మంది బ్రాహ్మణులను తీసుకువచ్చారు.

Vegetables from kcr form house at Chandi yagam

పోకచెక్కల ఆకులతో ప్రత్యేకంగా తయారు చేయించిన విస్తర్లను కేరళ నుంచి తెప్పించారు. వీరి కోసం 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భోజనశాలను ఏర్పాటు చేశారు. రుత్విక్కులకు వంట ఏర్పాట్లు చూసే బాధ్యత ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కు అప్పగించారు.

ప్రత్యేక భోజనశాల ఏర్పాటు:
వీఐపీలు, స్థానిక బ్రాహ్మణుల కోసం వీఐపీ లాంజ్ పక్కనే మరో భోజనశాలను ఏర్పాటు చేశారు. ఈ మెనూ కూడా దాదాపు రుత్వికుల మెనూనే పోలి ఉంది. కానీ బఫే పద్ధతిలో, ప్లాస్టిక్ విస్తర్లతో భోజనం ఏర్పాటు చేశారు. ఈ భోజనాలకు కూడా 4 క్వింటాళ్ల బియ్యం, క్వింటాలు కూరగాయలు, క్వింటాలు పప్పు, 5 క్వింటాళ్ల పెరుగును వినియోగిస్తున్నారు.

Vegetables from kcr form house at Chandi yagam

కేసీఆర్ ఫాంహౌస్ నుంచే కూరగాయలు, పూలు:
చండీయాగంలో ప్రత్యేక వంటల కోసం కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచే కూరగాయలు తరలిస్తున్నారు. మొత్తం మూడు వంటశాలలు ఏర్పాటు చేశారు. రుత్విక్కుల కోసం ఒకటి, వీఐపీలు, సాధారణ బ్రాహ్మణులకు మరోటి, భక్తుల కోసం వేరొక వంటశాలలను వేర్వేరుగా ఏర్పాటు చేశారు.

రుత్విక్కుల వంటశాలలోకి ఇతరులకు ప్రవేశం లేదు. తయారు చేస్తున్న కూరల్లో 80 శాతం కూరగాయలను కేసీఆర్ ఫాంహౌస్ నుంచే కోసి నేరుగా తీసుకుని వస్తున్నారు. క్యాప్సికం, క్యాబేజీ, బెండకాయ, దొండకాయ, టమాటా, ఆలుగడ్డ, మెంతికూర, పచ్చిమిర్చి, పాలకూర తదితర కూరగాయలను ఫాంహౌస్ నుంచే తీసుకువస్తున్నారు.

English summary
Vegetables from kcr form house at Chandi yagam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X