Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వేణుస్వామి వకుట భైరవ పూజ.. నీళ్ళపై తేలుతూ, మద్యం, మాంసంతో!

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. సినీ సెలబ్రిటీల జీవితాల గురించి ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ, కాంట్రవర్సీ జాతకాలు చెప్పే వేణు స్వామి ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. గతంలో నాగచైతన్య సమంత గురించి, నాగచైతన్య శోభిత గురించి కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి ట్రోల్స్ కి గురి కావడమే కాకుండా, కేసులను కూడా ఎదుర్కొన్నారు.

కాంట్రవర్సీల వేణు స్వామి
గతంలో ఏపీ రాజకీయాల పైన కూడా సంచలన వ్యాఖ్యలు చేసి 2024 ఎన్నికల్లో వైయస్ జగన్ గెలుస్తాడని బల్ల గుద్ది మరీ చెప్పాడు. అయితే వేణు స్వామి తాను చెప్పిన జోస్యం తప్పు కావడంతో ఇంకెప్పుడు జాతకాలు చెప్పనని వీడియో రిలీజ్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ కాంట్రవర్సీ వీడియోలు చేస్తూనే ఉన్నాడు. అంతేకాదు సినిమా సెలబ్రిటీలు, ప్రముఖ యూట్యూబర్ లకు వేణు స్వామి ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు.

venu swamy vakuta bhairava puja with liquor and meat and did japam by floating on water

కామాఖ్య ఆలయంపై వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు
వారి ఉన్నతి కోసం రహస్య పూజలు చేయడంలో వేణు స్వామి సిద్ధహస్తుడు అని చెబుతారు. గతంలో సంతానంలేనివారు కామాఖ్య ఆలయం కొండపై కలిస్తే ఏడాదిలోపు పిల్లలు పుడతారని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అక్కడ పూజలు చేసే క్రమంలో అమ్మవారికి మాంసాహారాన్ని సమర్పించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు కామాఖ్య ఆలయ అర్చకులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయనను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు.

మద్యం, మాంసంతో వేణుస్వామి వకుట భైరవ పూజ
ఆ తర్వాత కూడా ఆయన వకుట భైరవ అనే పేరుతో నిర్వహించిన పూజలు కూడా కాంట్రవర్సీ అయ్యాయి. వకుట భైరవ పూజా కార్యక్రమంలో స్వామివారికి నైవేద్యంగా మద్యం మాంసం నివేదించి. ఆ పదార్థాలన్నింటిని తిరిగి హోమంలో వేసే ఆహుతి చేశారు. ఈ పూజ ఎవరి పేరుతో అయితే నిర్వహిస్తారో వారి కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయని రాజకీయ వ్యవహారాలు, డబ్బు పరమైన విజయాలు కలుగుతాయని వేణు స్వామి చెప్పారు.

నీటిపై తేలియాడుతూ వకుట భైరవ జపం
ఈ పూజతో శత్రువుల పీడ కూడా విరగడ అవుతుందని చెప్పారు. పూజ తర్వాత ఫలితం దక్కాలంటే పూజలో చివరిగా నీటిపై తేలియాడుతూ వకుట భైరవ పూజకు సంబంధించిన మంత్రాలను జపించాలని వేణు స్వామి పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగానే పూజ తర్వాత తన ఫామ్ హౌస్ లోని స్విమ్మింగ్ పూల్ నీటిలో తేలియాడుతూ వకుట భైరవ పూజకు సంబంధించిన మంత్రాలను జపిస్తూ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

మామూలు కళాకారుడు కాదంటూ కామెంట్స్
ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది. వేణు స్వామి చేసే పూజలన్నీ ప్రత్యేక పూజలనీ, వాటి ఫలితం ఎలా ఉంటుందో పక్కన పెడితే ఎవరు చేయని హోమాలు, ఎవరూ చేయని ప్రత్యేక పూజలు చేయడంలో ఆయన సిద్ధహస్తుడు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. హోమంలో మద్యం, మాంసం వేయడం ఏమిటి అని కొందరు ఆయనను ట్రోల్ చేస్తున్నారు. ఇంకొందరు అంత శరీరం ఉన్నా నీళ్లలో తేలియాడుతూ జపం చేయడం అంటే మామూలు విషయం కాదని, వేణు స్వామి లో కనిపించని చాలా కళలు ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+