ఓటేశానని దేవుడిమీద ఒట్టెయ్.. లేదంటే డబ్బులిచ్చెయ్: షాకింగ్ వైరల్ వీడియో!
తెలంగాణ రాష్ట్రంలో 2026 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో అనేక ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈసారి మున్సిపల్ ఎన్నికలలో ప్రజలను షాక్ కు గురి చేసే అనేక వీడియోలు వైరల్ గా మారాయి. ఎన్నికలలో ఓటు వేయడానికి డబ్బులను, వస్తువులను ఇచ్చిన కొందరు ఓటు వేయని వారి నుండి తిరిగి తీసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
డబ్బులిచ్చినా ఓటు వెయ్యని వారి లెక్క తెల్చేపనిలో అభ్యర్థులు
తాజాగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో 9వ డివిజన్ నుంచి పోటీ చేసిన బిజెపి అభ్యర్థి జాది తిరుపతి ఎన్నికల ఫలితాలలో ఓటమిపాలయ్యారు. ఆయన 16 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థితో ఓడిపోయారు. ఇక ఓటమితో తీవ్ర ఆవేదనలో ఉన్న ఆయన, ఆయన కుటుంబ సభ్యులు తమకు ఓటేస్తామని హామీ ఇచ్చి తమ వద్ద నగదు తీసుకున్న వారి లెక్క తేల్చే పనిలో పడ్డారు.

ఒట్టేసి చెప్పమని ప్రశ్న.. ఓటు వెయ్యకుంటే ఇచ్చిన డబ్బులు వసూలు
ఇంటింటికి తిరుగుతూ తమకు ఓటు వేశారా లేదా అనేది ఎంక్వయిరీ చేస్తూ, ఒట్టేసి చెప్పమని ప్రశ్నిస్తున్నారు. తమకు ఓటు వేసాము అని చెప్పిన వారిని వదిలేసి, ఓటు వేయని వారి నుండి రిటర్న్ డబ్బులు తీసుకుంటున్నారు. ఓటుకు మూడు వేల రూపాయల చొప్పున డబ్బులు ఇచ్చిన వారు తిరిగి ఆ డబ్బులను తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ఆయన భార్య రూప ప్రతి ఇంటికి వెళ్లి తన భర్త తిరుపతికి ఓటు వేశారని దేవుడిపై ప్రమాణం చేయాలని డిమాండ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓటు వేస్తే ఒట్టేసి చెప్పండి, డబ్బులు తిరిగి ఇచ్చేయండి అని రూప డిమాండ్ చేయడం ఆ వీడియోలో ప్రధానంగా కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వృద్ధురాలి అమాయకత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
SWEAR ON GOD THAT YOU VOTED…
— Revathi (@revathitweets) February 14, 2026
OR PAY BACK!
BJP candidate Jadi Tirupati, who lost in Mancherial Municipal Corporation Division 9, in the recently concluded Telangana Municipal polls decided that it is “pay back” time quite literally.
His wife Roopa went to every house and… pic.twitter.com/N3Uqgml75D
డబ్బులు తిరిగి ఇచ్చిన వీడియో
ఆమె తండ్రి తిరుపతికి ఓటు వేయలేదు, కాబట్టి ఆమె వారికి చెల్లించిన రూ. 3000 తిరిగి ఇచ్చింది. తాను ఓటు వేసింది కాబట్టి ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ఇక ఈ వీడియో ఓటర్లను డబ్బులతో ప్రలోభ పెడుతున్న అభ్యర్థుల తీరును, నోటుకు ఓటు అమ్ముకుంటున్న ఓటర్ల తీరును కళ్ళకు కడుతుంది.
అధికారులు దృష్టి సారిస్తారా?
ప్రభుత్వాలు ప్రజలలో ఓటు హక్కుపై చైతన్యం తీసుకురావడానికి ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ, ఇంకా ఓటర్లు ప్రలోభాలకు గురవుతూనే ఉన్నారు అని చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం. మరి ఇటువంటి వీడియోలు బయటకు వచ్చిన తర్వాత అయినా అధికారులు వీటి పైన దృష్టి సారిస్తారా.. లేదా అన్నది తెలియాల్సి ఉంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications