Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గెలిచినా ఓడినా.. కేసీఆర్ లెక్క ఇదే; జోరుగా చర్చ!!

తెలంగాణా రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠకు కారణమయ్యాయి. తెలంగాణా రాష్ట్రంలో గత రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఈసారి కూడా హోరాహోరీగా పోరాటం చేసింది. అయినా ఎగ్జిట్ పోల్ సర్వేలు రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని అంచనాలను వెల్లడించాయి.

ఇక ఇదే సమయంలో తెలంగాణా లో గెలిస్తే కేసీఆర్ ఏం చేస్తారు? ఓడిపోతే కేసీఆర్ భవిష్యత్ ప్లాన్ ఏంటి అన్న దానిపై తెలంగాణా సమాజంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలోనే తాను గెలిచినా, ఓడినా ఆయనకు పెద్దగా నష్టం లేదని స్పష్టం చేశారు.

What will KCR do if he loses in Telangana?

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి రెండుసార్లు అధికారాన్ని ప్రజలు కట్టబెట్టగా , మూడవసారి అధికారాన్ని ఆశించిన కేసీఆర్ అధికారం రాకపోతే ఏం చేయాలో కూడా ముందే ప్లాన్ చేసుకున్నారని బయట ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. మూడవసారి అధికారంలోకి వస్తే పాలనా పగ్గాలు చేపట్టి ముందుకు నడవాలని భావించిన కేసీఆర్, ఒకవేళ అధికారంలోకి రాకపోతే ఏం చేయాలనే దాని పైన కూడా పూర్తి క్లారిటీతో ఉన్నారు.

ఈసారి అధికారంలోకి రావడం కోసం కేసీఆర్ శతవిధాల ప్రయత్నం చేశారు. ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రకటించి, అభివృద్ధి మంత్రంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. అంతే కాదు గత ఎన్నికలకు భిన్నంగా సుడిగాలి పర్యటనలు చేసి ప్రజల మద్దతు పొందే ప్రయత్నం చేశారు. యజ్ఞాలు, యాగాలు చేశారు.

తాను చేయగలిగినవన్నీ చేసిన కేసీఆర్ ఒకవేళ ఓటమిపాలైతే రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఉన్న పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చిన ఆయన దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ రాజకీయాలపై దృష్టి సారించాలని భావిస్తున్నట్లుగా సమాచారం. తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే కేసీఆర్ రానున్న పార్లమెంట్ ఎన్నికలకు జాతీయపార్టీగా సిద్ధం కావాలని ఆలోచిస్తున్నారని అంటున్నారు.

కేసీఆర్ ఏదైనా పని చేస్తే చాలా దూరదృష్టితో చేస్తారని, ఈ ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం ఆయన దేశ రాజకీయాలపై దృష్టి పెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేలా కార్యాచరణ సాగిస్తారని చెప్తున్నారు. అయితే ఇక్కడ గెలవకుండా దేశ రాజకీయాలకు వెళితే ఆయనను పట్టించుకునేది ఎవరు? అని ఆయన స్ట్రాటజీ గురించి చెప్తున్న వాళ్ళను వింటున్న వాళ్ళు ప్రశ్నిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+