• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గుడ్ మార్నింగ్: 'వాట్సాప్‌లో మేసేజ్, కూతురిపై ప్రేమ, ఒంటరిగా ఫీలయ్యాడు'

By Narsimha
|

హైదరాబాద్: తెలుగు సినీ హస్య నటుడు విజయ్ మరణవార్త వినగానే ఆయన మిత్రులు కన్నీరు మున్నీరయ్యారు. స్నేహితులతో ఎప్పుడూ సరదాగా ఉండే విజయ్ కొంతకాలంగా ఒంటరితనంగా ఫీలవుతున్నాడని ఆయన స్నేహితులు చెబుతున్నారు. విజయ్ మరణించాడని తెలుసుకొన్న వెంటనే సినీ ప్రముఖులు విజయ్ సాయి ఇంటికి వెళ్ళి విజయ్‌ను కడసారి చూశారు. విజయ్‌సాయికి ఆర్థిక ఇబ్బందులు లేవని కుటుంబసభ్యులు ప్రకటించారు.

  ఆత్మహత్య ముందు విజయ్ సెల్ఫీ వీడియో.. ఏం చెప్పాడంటే...?

  ట్విస్ట్: విజయ్ మృతిపై భార్య వనితా అనుమానం, 'ఫోరెన్సిక్ ల్యాబ్‌కు సెల్ఫీ వీడియో'

  తెలుగు సినీ పరిశ్రమలో అనతి కాలంలో గుర్తింపు తెచ్చుకొన్న సినీ నటుడు విజయ్ సాయి జీవితం విషాంతాంగా మారింది. భార్యతో కోర్టులో కేసులతో ఆమెతో దూరంగా ఉంటున్నాడు. అయితే చనిపోయే ముందు విజయ్ భార్యపై ఆరోపణలు చేశాడు.

  అయితే ఇటీవల కాలంలో విజయ్ ఒంటరితనాన్ని ఫీలవుతున్నారని ఆయన స్నేహితులు అభిప్రాయపడ్డారు.ఉదయం పూటే తమ స్నేహితులతో ఛాటింగ్ చేశాడు విజయ్ సాయి. కానీ, కొద్ది సేపటికి ఆయన ఆత్మహత్య చేసుకొన్నాడు.

  ఉదయం పూటే స్నేహితులతో ఇలా

  ఉదయం పూటే స్నేహితులతో ఇలా

  విజయ్‌సాయి తమ స్నేహితులకు వాట్సాప్ గ్రూప్ ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో విజయ్ సాయి గుడ్ మార్నింగ్ అంటూ మేసేజ్ పెట్టాడు. లేసిన తర్వాత బయటకు వెళ్ళాలని భావించాడు. తల్లికి భోజనం రెడీ చేయాలని కోరాడు.అదే సమయంలో అతడి స్నేహితుడు కూడ ఇంటికి వచ్చాడు. అయితే తన రూమ్‌లోకి వెళ్ళిన విజయ్ సాయి ఎంతకీ బయటకు రాకపోవడంతో విజయ్ స్నేహితుడు, ఆమె తల్లి ఆందోళన చెందారు. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తలుపును బద్దలు కొట్టారు.అప్పటికే విజయ్ సాయి ఉరేసుకొన్నాడు.

  కన్నీరుమున్నీరైన స్నేహితులు

  కన్నీరుమున్నీరైన స్నేహితులు

  హాస్యనటుడు విజయ్ మరణ వార్త వినగానే అతని మిత్రులు కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న స్నేహితులు హుటాహుటిన విజయ్ నివాసానికి చేరుకున్నారు. ఎప్పుడూ తమతో సరదాగా ఉండే విజయ్ ఇలా దూరమవుతాడని ఎప్పుడూ ఊహించలేదని జబర్దస్త్ రాకేష్ అభిప్రాయపడ్డారు.

  మూడు మాసాల నుండి దూరంగా

  మూడు మాసాల నుండి దూరంగా

  విజయ్‌తో మాతో చాలా మంచిగా వుండేవారని కానీ గత మూడు నెలలుగా మమ్మల్నందర్నీ దూరంగా పెట్టాడని రాకేష్ చెప్పాడు. ఏమైందని ఫోన్ చేస్తే త్వరలోనే మనమంతా కలుద్దాం.. పార్టీ చేసుకుందామని చెప్పాడని రాకేష్ తెలిపాడు. అలా చేయద్దు.. ఇలా చేయద్దని మాకే సలహాలు ఇచ్చే విజయ్ ఇవాళ విగతజీవిగా పడిఉండటాన్ని మేమంతా జీర్ణించుకోలేక పోతున్నామని రాకేష్ కంటతడిపెట్టారు.

  భార్యతో గొడవలున్నాయి

  భార్యతో గొడవలున్నాయి

  విజయ్ దంపతుల మధ్య గొడవలున్నాయన్న మాట వాస్తవమే కానీ ఆత్మహత్య చేసుకునేంత గొడవలు కావనీ స్పష్టం చేశాడు రాకేష్. అయితే ఇంత సడన్‌గా ఇలా చేస్తాడని మేం ఊహించలేదన్నాడు. విజయ్ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేశాను. ప్రస్తుతం విజయ్ తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడు.. తల్లికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందని రాకేష్ చెప్పాడు.

  ఆ వాతావరణంలో కూతురు పెరగడం ఇష్టం లేదు

  ఆ వాతావరణంలో కూతురు పెరగడం ఇష్టం లేదు

  తన కూతురు వనితారెడ్డి వద్ద పెరగడం తనకు ఇష్టం లేదని విజయ్ సాయి సెల్పీ వీడియోలో పేర్కొన్నాడని చెబుతున్నారు. వాల్‌పోస్టర్ సినిమా ద్వారా వనిత తనకు పరిచయమైన విషయాన్ని విజయ్ ఆ వీడియోలో పేర్కొన్నాడంటున్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Jabhardhastu actor Rakesh said that Vijay sai best friend for me ,but The actor’s parents blamed his estranged wife Vanitha Reddy for his suicide.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more