కలికాలం.. చెడు వ్యసనాలకు బానిసై మొగుడ్నే మట్టుపెట్టిన మహా ఇల్లాలు!!
మద్యం సేవించటం వంటి వ్యసనాలకు బానిసై, అడ్డు చెప్తున్న భర్తను భార్య అమానుషంగా హతమార్చిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ఒకప్పుడు భర్తలు భార్యలను హింసించడం, భార్యల పైన దారుణాలకు ఒడిగట్టడం, భార్యలను చిత్రహింసలకు గురి చెయ్యటం, హతమార్చటం వంటి అనేక దారుణాలను విన్నాం. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. కలికాలం వచ్చేసింది.. భార్యలే భర్తల పైన దాడులు చేసే ఘటనలు, వ్యసనాలకు బానిసలై భర్తలను హతమారుస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక ప్రస్తుత పరిస్థితులు సమాజాన్ని ఆలోచించేలా చేస్తున్నాయి.

భర్తను చంపిన భార్య
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో వ్యసనానికి బానిస భర్తను హతమార్చిన ఓ భార్య ఉదంతం సభ్య సమాజాన్ని షాక్ కు గురి చేసింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ ఘటన వివరాల్లోకి వెళితే సంజయ్ గాంధీ నగర్ లో నివాసం ఉండే 28 సంవత్సరాల సంతోష్ అనే యువకుడిని 24 ఏళ్ల భార్య రేణుక చున్నీతో ఉరి బిగించి హతమార్చిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. వ్యసనాలకు బానిసై, అడ్డు చెప్తున్న భర్తను భార్య అమానుషంగా హతమార్చింది.

కల్లుకు బానిసైన భార్య .. మరో మైనర్ బాలికను ఇంటికి తెచ్చుకుని
జీడిమెట్ల పోలీసులు తెలిపిన కథనం ప్రకారం 2016లో సంతోష్, రేణుక ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెళ్లయిన సంవత్సరం తర్వాత నుండి రేణుక చెడు వ్యసనాలకు బానిసైంది. కల్లు దుకాణంలో రోజు కల్లు తాగడానికి అలవాటు పడిన రేణుక భర్తతో తరచూ గొడవకు దిగుతుంది. ఇక కల్లు దుకాణం దగ్గర పరిచయమైన దుండిగల్ తండాకు చెందిన మరొక 17 సంవత్సరాల బాలికను ఇంటికి తీసుకువచ్చి ఆ బాలికను తనతో పాటు ఉంచుకుంటుంది.

భర్తను బాలిక సాయంతో చంపి సంచిలో కట్టి బయట పారేసిన ఇల్లాలు
భార్య తీరుతో విసిగిపోయిన భర్త సంతోష్ ఆరవ తేదీ రాత్రి ఆమెతో గొడవకు దిగాడు. ఇక గొడవ తర్వాత తనకు అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా అడ్డు లేకుండా చేసుకోవాలని భావించిన రేణుక భర్తను చంపేయాలని పథకం వేసింది. అదే రోజు రాత్రి భర్త సంతోష్, రేణుక, వారి ఇంట్లోనే ఉంటున్న బాలిక ముగ్గురు ఫుల్లుగా మద్యం సేవించారు. ఆపై మద్యం మత్తు లోకి జారుకున్న సంతోష్ మెడకు చున్ని బిగించి బాలిక సహాయంతో రేణుక భర్తను హత్య చేసింది. అనంతరం భర్త మృతదేహాన్ని ఒక సంచిలో పెట్టి దాన్ని బయట పారేసింది ఈ మహా ఇల్లాలు. ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు విచారణలో రేణుక, బాలికతో కలిసి భర్తను హతమార్చినట్టు తేల్చారు. భర్తను హతమార్చిన రేణుకను, రేణుకకు సహకరించిన బాలికను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications