year ender 2023: తలక్రిందులైన కేసీఆర్ రాజకీయం.. కాంగ్రెస్ కు అధికారం!!

2023 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ఊహించని సంచలన మార్పు చోటుచేసుకుంది. 2023 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర గతిని మార్చేశాయి. దశాబ్ద కాలంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న బి ఆర్ ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓటమిపాలై, అధికారాన్ని కోల్పోవడంతో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనా పగ్గాలు చేపట్టింది. కేసీఆర్ రాజకీయం తలక్రిందులు కాగా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది.

2023 ఆరంభంలో ఏమాత్రం జవసత్వాలు లేకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీ, అనూహ్యంగా ఎన్నికల కాలానికి పుంజుకుంది. 2023 ఆరంభంలో బండి సంజయ్ సారధ్యంలోని బిజెపి బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కనిపించినప్పటికీ, బిజెపి అధినాయకత్వం బండి సంజయ్ ను మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి నక్క తోక తొక్కినట్టుగా మారింది. బండి సంజయ్ ను మార్చిన తర్వాత బిజెపి గ్రాఫ్ పడిపోగా, ఊహించని విధంగా కాంగ్రెస్ గ్రాఫ్ పుంజుకుంది.

year ender 2023: KCR politics upside down.. Power to Congress!!

తెలంగాణ ఎన్నికల సమయానికి కూడా పెద్దగా ప్రజాక్షేత్రంలో దూకుడు చూపించని కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారిగా ప్రజలలో ప్రజాదరణ పెరిగింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వేవ్ కొనసాగింది. ఈ వేవ్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కట్టబెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ మంత్రంతో పాలన చేశామని, ఒకప్పుడు ఎట్లుండే తెలంగాణ.. ఇప్పుడు ఎట్లా అయింది తెలంగాణ అంటూ నాటికీ, నేటికీ మార్పును చూడమని కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లారు.

మళ్లీ తమనే ఆదరించమని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థించినప్పటికీ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరించలేదు. రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని ఆదరించి అత్యధిక మెజారిటీని ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. ఇది 2023 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ ఊహించని సంచలన పరిణామం.

అంతకుముందు జరిగిన ఉప ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైంది. డిపాజిట్లు కూడా కోల్పోయి పరువు పోగొట్టుకుంది. పేలవమైన ప్రదర్శనతో కాంగ్రెస్ ఉనికి కోసం పోరాటం చేసింది. కానీ 2023 సంవత్సరాంతానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికార పార్టీగా మారింది. తిరుగులేని నాయకుడైన కేసీఆర్ ను దెబ్బకొట్టి అధికారం చెప్పటింది. ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి బాగా లాభించింది. పాలనా పగ్గాలు చేపట్టి పవర్ ఫుల్ పార్టీగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+