సెల్ఫ్ డిఫెన్స్ నా బాధ్యత: పోలీసులను కొట్టటం పై వైఎస్ షర్మిల చెప్పిందిదే!!
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల పోలీసులపై దురుసుగా వ్యవహరించిన కారణంగా ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి షర్మిలను అరెస్ట్ చేశారు. సిట్ ఆఫీసుకు వెళ్లాలి అనుకున్న వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు, వైయస్ షర్మిలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో వైయస్ షర్మిల డ్యూటీలో ఉన్న ఎస్సై పై, పోలీస్ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు.
దీంతో వైయస్ షర్మిల పై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమెను అరెస్ట్ చేశారు. ఇక ఈ క్రమంలో వైయస్ షర్మిల నేనేమైనా క్రిమినల్ నా? హంతకురాలినా? అని పోలీసులపై మండిపడ్డారు. తనకు వ్యక్తిగత స్వేచ్ఛ లేదా అంటూ ప్రశ్నించిన షర్మిల తనను ఎందుకు అడ్డుకుంటున్నారు చెప్పాలంటూ నిలదీశారు. తన రక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం తన బాధ్యత అని పేర్కొన్నారు.

పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని వారి నుంచి కాపాడుకోవడం కోసమే సెల్ఫ్ డిఫెన్స్ చేశానని తెలిపారు. తాను సిట్ అధికారిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని అనుకున్నానని, తాను ఎటువంటి ధర్నాకు, నిరసనకు పిలుపునివ్వలేదని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.కాగా వైయస్ షర్మిల మహిళా కానిస్టేబుల్ చెంపపై కొట్టడం, ఎస్సై పై చేయి చేసుకోవడం.. దాంతో ఎస్ఐ నన్ను ఎందుకు కొడుతున్నారు అంటూ ప్రశ్నించడం వీడియోలలో స్పష్టంగా కనిపిస్తుంది.
పోలీసులపై చేయి చేసుకోవడంతో వైయస్ షర్మిలను మహిళా పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వైఎస్ షర్మిలపై ఐపీసీ 353, 330 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా సమాచారం. ఇక వైఎస్ షర్మిల కోసం వైఎస్ విజయమ్మ పోలీస్ స్టేషన్ కు వెళ్లగా, వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల అరెస్టుతో లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.












Click it and Unblock the Notifications