నువ్వు కూడానా... కడియం శ్రీహరికి వైఎస్ షర్మిల అదిరిపోయే కౌంటర్!!
కడియం శ్రీహరికి వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పాదయాత్రను కొనసాగించారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వైయస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాలని, వైయస్ జగన్ జైలుకు వెళితే అక్కడ ఆమె సీఎం కావచ్చు అని తీవ్ర వ్యాఖ్యలు చేస్తారు. ఇక ఈ నేపథ్యంలో తాజాగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన పాదయాత్రలో వైఎస్ షర్మిల కడియం శ్రీహరికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.
ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యల తీరుపై షర్మిల వ్యాఖ్యలు
ప్రజాప్రస్థానం పాదయాత్ర 230వ రోజు స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం గర్నెపల్లి నుంచి ప్రారంభించి, జఫర్ గడ్ మండలంలోని తిడుగు, కొనాయిచలం, కస్నతండా, దుర్గ్య తండా, తిమ్మంపేట, నమిలికొండ మీదుగా సాయంత్రం స్టేషన్ ఘన్ పూర్ టౌన్ గాంధీ చౌక్ వద్ద బహిరంగ సభతో ముగిసింది. వైయస్ షర్మిల స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ రాజకీయాలపై, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యల తీరుపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. వైయస్సార్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఇప్పుడు వరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదని వైయస్ షర్మిల పేర్కొన్నారు.
వైఎస్సార్ పాలనకు కేసీఆర్ పాలనకు తేడా చెప్పిన వైఎస్ షర్మిల
వైయస్ రాజశేఖర్ రెడ్డి దేవాదుల ప్రాజెక్టు ద్వారా ధర్మసాగర్ నింపి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో లక్షా 50 వేల ఎకరాలకు నీళ్లిచ్చారని వైయస్ షర్మిల గుర్తు చేశారు. 30 వేల మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించారన్నారు. పాలిటెక్నిక్ కాలేజీ, రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించారన్నారు. గ్రామాల్లో కరెంటు, రోడ్లు అందుబాటులోకి తీసుకొచ్చారని షర్మిల పేర్కొన్నారు. ఇక కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ స్టేషన్ ఘన్ పూర్ కు చేసింది శూన్యం అని మండిపడ్డారు. వంద పడకల ఆస్పత్రి ఏమైంది? ఇండస్ట్రియల్ కారిడార్ ఏమైంది? లెదర్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏమయ్యాయి? పరిశ్రమలు వస్తాయి.. ఉద్యోగాలిస్తామన్నారు.. ఇచ్చారా? ఒక్కటంటే ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

తొమ్మిదేళ్లు మంత్రిగా పనిచేసి ఏం చేశారో చెప్పండి శ్రీహరి
అంతేకాదు తనకు ఉచిత సలహాలు ఇచ్చిన కడియం శ్రీహరి పై వైయస్ షర్మిల మండిపడ్డారు. ఇంతకాలం కడియం శ్రీహరి పెద్దమనిషి అనుకున్నానని, కానీ ఆయనలో అటువంటి లక్షణాలు ఏవి లేవన్నారు. తెలంగాణకు వైయస్ రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకి అని కడియం శ్రీహరి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తొమ్మిదేళ్లు మంత్రిగా పనిచేసిన నియోజకవర్గానికి ఏమి చేయలేని అసమర్ధుడు కడియం శ్రీహరి అని ఎద్దేవా చేశారు. వైయస్సార్ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి ఎందుకు వ్యతిరేకో చెప్పాలన్నారు. నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కాలేజీ నిర్మించినందుకు వ్యతిరేకా? లక్షా 50 వేల ఎకరాలకు నీళ్లిచ్చినందుకు వ్యతిరేకా? 30 వేల ఇండ్లు ఇచ్చినందుకు వ్యతిరేకా? రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించినందుకు వైయస్సార్ వ్యతిరేకా? అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
తెలంగాణా ద్రోహివి నువ్వు.. రివర్స్ ఎటాక్
ఉద్యమం పేరు చెప్పి అధికారం అనుభవిస్తున్న తెలంగాణ ద్రోహివి నువ్వు అంటూ కడియం శ్రీహరి పై విరుచుకుపడ్డారు. తొమ్మిదేళ్లు మంత్రిగా ఉండి నియోజకవర్గానికి కనీసం డిగ్రీ కాలేజీ కూడా తీసుకురాని నువ్వు కూడా మాట్లాడుతున్నావా.. అంటూ షర్మిల ఎద్దేవా చేశారు. కెసిఆర్ తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పొడిస్తే వైయస్సార్ పాలన తీసుకురావడం కోసమే తాను వైయస్సార్ తెలంగాణ పార్టీని పెట్టానని వైయస్ షర్మిల మరోమారు స్పష్టం చేశారు.
రాసలీలల రాజయ్య.. ఎన్కౌంటర్ ల శ్రీహరి: వైఎస్ షర్మిల విమర్శలు
నియోజకవర్గానికి ఇద్దరు నాయకులు ఉన్నారని ఇద్దరికీ 24 గంటలు కొట్టుకోవడమే సరిపోద్ది అంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఇద్దరికీ ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప ప్రజాసేవపై ధ్యాసే లేదని వైయస్ షర్మిల మండిపడ్డారు.రాసలీలల రాజయ్య అని శ్రీహరి అంటే..ఎన్కౌంటర్ల శ్రీహరి అని రాజయ్య తిడతాడని వైయస్ షర్మిల వాళ్ళ వైఖరిని ఎండగట్టారు.ఇద్దరూ దళిత నాయకులై ఉండి దళితుల సమస్యలపై ఏనాడూ నోరెత్తరు అంటూ షర్మిల ఇద్దరు నేతలను టార్గెట్ చేశారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications