తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమలలో విషాదం: పాల వ్యాన్ కింద పడి భక్తుడు మృతి, ఇలా చేయొద్దంటూ రమణదీక్షితుల వినతి

|
Google Oneindia TeluguNews

తిరుపతి: తిరుమలలో విషాద ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం లారీ కిందకు దూకి ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. శ్రీవారి పూజా కైంకర్యాల కోసం పాలను తీసుకుని లారీ వచ్చింది. కొద్ది సేపటి తర్వాత ఆ లారీ తిరిగి కొండపై నుంచి వెళుతుండగా.. రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఓ వ్యక్తి ఒక్కసారిగా లారీ టైర్ల కిందకు దూకాడు.

భక్తుడి బలవన్మరణం

భక్తుడి బలవన్మరణం

లారీ అతడిపై నుంచి దూసుకెళ్ళింది. గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి పరుగులు తీశారు. లారీ కింద నుంచి బాధితుడ్ని బయటకు తీశారు. అయితే, అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.

తమిళనాడుకు చెందిన వ్యక్తిగా అనుమానం

తమిళనాడుకు చెందిన వ్యక్తిగా అనుమానం

పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తర్వాత తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీకి పోస్టుమార్టం కోసం తరలించారు. చనిపోయిన వ్యక్తి ఎవరనే విషయం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాధాకరమంటూ రమణదీక్షితుల వినతి

బాధాకరమంటూ రమణదీక్షితుల వినతి

ఈ ఘటనపై టీటీడీ ఆగమ సలహాదారు రమణదీక్షితులు మీడియాతో మాట్లాడుతూ.. ఓ భక్తుడు పాల వ్యాన్ కింద పడి చనిపోవడం బాధాకరమన్నారు. మాఢ వీధులలో మరణం జరగడంతో ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేసి తర్వాత యధావిధిగా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.

ఇలా చేయొద్దంటూ భక్తులకు వినతి

ఇలా చేయొద్దంటూ భక్తులకు వినతి


తిరుమలలో దేహ త్యాగం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మూఢ నమ్మకంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని రమణదీక్షితులు తెలిపారు. తిరుమలలో ప్రమాదవశాత్తు ఏదైనా మరణం సంభవిస్తే అలాంటి వారికి మాత్రమే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని చెప్పారు. బలవంతపు మరణం చాలా దారుణమని, ఇలాంటి చర్యలకు భక్తులు ఎవరు పాల్పడవద్దని, ఇది మంచి పద్ధతి కాదని.. చాలా పాపమని రమణదీక్షితులు వ్యాఖ్యానించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న చర్యలు ఎవరూ చేయకూడదని అన్నారు.

English summary
An unexpected tragedy has happened near Tirumala temple in the early hours on Friday. A devotee has committed suicide by falling under the moving milk tanker which belongs to TTD.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X