శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - దర్శనం, వసతి, సేవా టికెట్లు విడుదల..!!

Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది. రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు రేపు (20వ తేదీ) టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. అదే విధంగా మే, జూన్ నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. 26న మే నెలకు సంబంధించిన గదుల బుకింక్ కోటాను విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. రేపటి వరుసగా ఆరు రోజుల పాటు శ్రీవారి సేవలతో పాటుగా దర్శనం..వసతి టికెట్లను టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది.

శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు:తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఏప్రిల్ 20న ఉదయం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ లో టికెట్లు మంజూరవుతాయి. ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూలై నెల ఆన్ లైన్ కోటాను ఏప్రిల్ 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి విడుదల చేయనుంది.

TTD To Releae Srivari Special Entry Darshan

ఏప్రిల్ 21న అంగప్రదక్షిణం టోకెన్లు:జూలై నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఏప్రిల్ 21న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను ఏప్రిల్ 21న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు, జూన్ నెల కోటాను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

ఏప్రిల్ 25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల:వీటితో పాటుగా మే, జూన్ నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుమలలో మే నెల గదుల కోటాను ఏప్రిల్ 26న ఉదయం 10 గంటలకు, తిరుపతిలో మే నెల గదుల కోటాను ఏప్రిల్ 27న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనును్నారు. వేసవి రద్దీని పరిగణలోకి తీసుకొని వీటిని విడుదల చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. టీటీడీ వెబ్ సైట్ తో పాటుగా టీటీడీ యాప్ ద్వారా ఈ టికెట్లను పొందే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+