TTD: శ్రీవారి సేవా టికెట్లపై కీలక అప్డేట్ - ఈవో తాజా మార్గదర్శకాలు..!!

Tirumala: తిరుమలలో శ్రావణ రద్దీ కొనసాగుతోంది. కాలి నడక మార్గంలో భక్తుల భద్రతా చర్యలను టీటీడీ కొనసాగిస్తోంది. దివ్య దర్శనంలో తీసుకొచ్చిన వెసులుబాటుతో కాలి నడక మార్గంలో భక్తుల సంఖ్య బాగా తగ్గింది. ఇదే సమయంలో నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్‌ కోటాను టీటీడీ ఈ రోజు విడుదల చేయనుంది. నడక మార్గంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది.

నేడు ఆర్జిత సేవా టికెట్ల విడుదల: శ్రీవారి భక్తులకు టటీడీ కీలక సమాచారం ఇచ్చింది. ఈ రోజు నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్‌ కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఈ రోజు 19 (శనివారం)న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.

TTD to release Arjitha Seva tickets for the month of November on 19th, EO Issues Guide lines

ఈ నెల 21 ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. అలాగే శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను నవంబర్ నెల కోటాను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

23న అంగ ప్రదిక్షణ కోటా: తిరుమల శ్రీవారి దర్శనంతో కూడిన ఆన్‌లైన్ సేవ (వర్చువల్)లకు సంబంధించిన టికెట్లు కూడా విడుదలకానున్నాయి. నవంబర్‌ నెలకు సంబంధించిన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల టికెట్ల కోటాను ఈ నెల 22 మధాహ్నం మూడు గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

అంతేకాదు నవంబర్‌ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టికెట్లను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ భక్తులకు సూచించింది. ఇక, నడ‌క మార్గాల్లో క్రూర‌మృగాల క‌ద‌లిక‌ల నేప‌థ్యంలో భ‌క్తుల భ‌ద్ర‌త దృష్ట్యా దుకాణదారుల‌కు టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి ప‌లు సూచ‌న‌లు చేశారు.

TTD to release Arjitha Seva tickets for the month of November on 19th, EO Issues Guide lines

ఈవో ధర్మారెడ్డి సూచనలు: పోలీసు, అటవీ, ఎస్టేట్, ఆరోగ్య శాఖ అధికారులతోపాటు దుకాణాల నిర్వాహ‌కుల‌తో ఈవో స‌మావేశం నిర్వ‌హించి ప‌లు అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. అలిపిరి న‌డ‌క మార్గంలో వందకు పైగా తినుబండారాలు విక్ర‌యించే దుకాణాలు ఉన్నాయ‌ని, వీటిలో ఇక‌పై పండ్లు, కూర‌గాయ‌లు విక్ర‌యించ‌రాద‌ని సూచించారు.

భ‌క్తులు వీటిని కొనుగోలు చేసి సాధు జంతువుల‌కు తినిపించ‌డం వ‌ల్ల వాటి రాక పెరుగుతోంద‌ని, ఈ జంతువుల కోసం క్రూర‌మృగాలు అటువైపు వ‌చ్చి భ‌క్తుల‌పై దాడి చేస్తున్నాయ‌ని వివ‌రించారు. భద్రతా చర్యల్లో భాగంగా నడకదారి పొడవునా సిసికెమరాలు ఏర్పాటు చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+