Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బంగారం ధరల్లో మళ్లీ పెరుగుదల: ఎంత పెరిగాయంటే?: రెండు తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా

విజయవాడ: బంగారం ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. కొన్ని రోజులుగా నేల చూపులు చూస్తూ వచ్చిన బంగారం, వెండి ధరల్లో సోమవారం స్వల్పంగా పెరుగుదల కనిపించింది. కొద్దిరోజులుగా బంగారం, వెండి ధరల్లో నమోదవుతూ వచ్చిన మహా పతనం.. ఒక స్థాయికి వచ్చేటప్పటికి నిలిచిపోయాయి. మళ్లీ స్వల్పంగా పైకి ఎగబాకడం ఆరంభించాయి. కొత్తగా నమోదైన ఈ పెరుగుదల నామమాత్రమే. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకుంటోన్న మార్పుల వల్లే బంగారం ధరల్లో హెచ్చు, తగ్గులు చోటు చేసుకుంటున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎంసీఎక్స్‌లో రూ. 10 మేర పెరుగుదల

ఎంసీఎక్స్‌లో రూ. 10 మేర పెరుగుదల

మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌ (ఎంసీఎక్స్)లో సోమవారం నాడు రికార్డయిన వివరాల ప్రకారం.. బంగారం ధరల్లో 10 రూపాయల పెరుగుదల నమోదైంది. 10 గ్రాముల బంగారం ధర.. 10 రూపాయల మేర పెరిగింది. 52,940 రూపాయలుగా ఎంసీఎక్స్‌లో నమోదైంది. వెండిలోనూ ఇదే తరహా పురోగతి కనిపించింది. కిలో ఒక్కింటికి వెండి 10 రూపాయల మేర పెరిగి, 65,370 వద్ద నిలిచింది. ఈ పెరుగుదల నామమాత్రమే అయినప్పటికీ.. కొద్దిరోజులుగా కొనసాగుతోన్న ధరల పతనాన్ని ఇది అడ్డుకుందనే అభిప్రాయాలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమౌతోంది. వాటి ధరలు మళ్లీ ఏ స్థాయిలో పెరుగుతాయనేది అంచనా ఇప్పుడిప్పుడే అంచనా వేయలేమని చెబుతున్నాయి.

 హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర..

హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర..

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో సోమవారం నాడు నమోదైన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 49,140 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 53,600 రూపాయలుగా నమోదైంది. ఇదివరకు నమోదైన ధరలతో పోల్చుకుంటే.. 10 రూపాయల పెరిగాయి. ఇవే తరహా రేట్లు విశాఖపట్నం, విజయవాడల్లోనూ నమోదు అయ్యాయి. 22 క్యారెట్ల బంగరాం ధర 10 గ్రాములకు విజయవాడ, విశాఖపట్నంలల్లో 49,140 రూపాయలుగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 53,600 రూపాయలుగా రికార్డయింది.

50 వేల రూపాయలకు దిగువగా

50 వేల రూపాయలకు దిగువగా

ఇదివరకు గరిష్ఠంగా 57 వేల రూపాయల వరకు బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. అక్కడి నుంచి రేట్లు క్రమంగా క్షీణిస్తూ వచ్చాయి. తాజాగా 53,600 రూపాయలకు చేరుకున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలను బట్టి చూస్తే.. ఇంతకుముందు నమోదైన క్షీణత మరిన్ని రోజుల పాటు కొనసాగుతుందనే అంచనాలు బులియన్ మార్కెట్‌లో వెలువడ్డాయి. 50 వేల రూపాయల కంటే దిగువకు చేరుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అనూహ్యంగా బంగారం, వెండి ధరల పతనం స్తంభించిపోయింది. నామమాత్రంగానైనా పెరుగుదలను రికార్డు చేసింది.

పెద్దగా మార్పులేవీ లేకున్నా..

పెద్దగా మార్పులేవీ లేకున్నా..

బంగారం ధరల పతనం ఆరంభమైన రోజులను పరిగణనలోకి తీసుకుంటే.. అంతర్జాతీయ మార్కెట్‌లో పెద్దగా మార్పులేవీ చోటు చేసుకోలేదని చెబుతున్నారు. అయినప్పటికీ.. వాటి రేట్ల పతనం స్తంభించిపోవడం మళ్లీ పెరుగుదలలో గ్రీన్ మార్క్ కనిపించడం కొత్త విశ్లేషణలకు ఆస్కారం ఇచ్చినట్టవుతుందని అభిప్రాయపడుతున్నారు. బంగారు, వెండి రేట్ల ధరల్లో కొద్దిరోజుల పాటైనా స్థిరత్వం కనిపిస్తుందా? లేదా? అనేది అంచనా వేయడం సాధ్యం కాదనే అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+