వల్లభనేని వంశీకి కరోనా.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు పాజిటివ్
కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేసుల ఉధృతి తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఫోర్త్ వేవ్ కంటిన్యూ అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా బారిన ప్రముఖులు కూడా పడ్డారు. శనివారం ఒక్క రోజే ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. ముగ్గురు నేతలు కూడా అధికార పార్టీకి చెందిన వారే.
గుంటూరు జిల్లా పరిధిలోని ప్రత్తిపాటి ఎమ్మెల్యే మేకతోచి సుచరిత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆ తర్వాత వైసీపీకి దగ్గరైన వల్లభనేని వంశీ మోహన్ కూడా కరోనా బారిన పడినట్లు తేలింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ క్లాసుల కోసం ఇటీవలే మొహాలీ వెళ్లిన వంశీ అక్కడే అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అక్కడే ప్రాథమిక వైద్యం చేయించుకున్న తర్వాత ఐఎస్‌బీ క్లాసులను ముగించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చారు.

నగరంలోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించున్నారు. పరీక్షల్లో భాగంగా ఆయనకు కరోనా సోకిందని నిర్ధారణ అయ్యింది. దీంతో హైదరాబాద్‌లోని తన ఇంటిలోనే హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవల తనను కలిసిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఫోర్త్ వేవ్ కేసులు పెరుగుతున్నాయి. మరణాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే అందరూ సెకండ్ డోసు తీసుకున్నారు. బూస్టర్ డోస్ కూడా చాలా మంది తీసుకున్నారు.
అయినప్పటికీ కరోనా వైరస్ సోకుతుంది. సీరియస్ నెస్ తక్కువగా ఉన్నా.. కేసులు మాత్రం వస్తూనే ఉన్నాయి. అవీ ఇప్పడిప్పుడు పెరుగుతున్నాయి. మరీ కేసుల ఎలా పెరుగుతాయో అనే ఆందోళన నెలకొంది.