గన్నవరం సచివాలయ ఉద్యోగి చేసిన పనికి చెప్పులు, చీపుర్లతో మహిళల వీరబాదుడు!!
గన్నవరం సచివాలయ ఉద్యోగి చేసిన పనికి చెప్పులు, చీపుర్లతో మహిళలు దేహ శుద్ధి చేశారు.
గన్నవరం సచివాలయం 3లో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగి చేసిన పాడు పని అతనికి మహిళలంతా కలిసి దేహ శుద్ధి చేసేలా చేసింది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఒక యువతికి తీరని వేదన మిగిల్చింది. ఇంతకీ గన్నవరం సచివాలయ ఉద్యోగి ఏం చేశారంటే..

తెల్లారితే పెళ్లి.. కానీ పెళ్లి రద్దు అని చెప్పిన వరుడి కుటుంబం
గన్నవరం సచివాలయం మూడు లో ఈడ్పుగంటి రాంబాబు గ్రామ వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. అదే సచివాలయ పరిధిలో వాలంటీర్ గా పనిచేస్తున్న యువతకి ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం చొప్పరమెట్లకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 22వ తేదీన వారి పెళ్లి జరగాల్సి ఉండగా ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాటు చేసుకుంటున్న క్రమంలో తెల్లారితే పెళ్లి అనగా, పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు వరుడు కుటుంబం నుండి వారికి కబురు అందింది.

పెళ్లి చెడగొట్టిన సచివాలయ ఉద్యోగి
దీంతో వధువుతో పాటు కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎందుకు వరుడు కుటుంబం పెళ్లి రద్దు చేసుకుంది అన్నది అర్ధం కాక తల బాదుకున్నారు. ఆపై వరుడి కుటుంబాన్ని ఆరా తీయడంతో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. పెళ్లికి ముందు రోజు రాత్రి పనిగట్టుకుని మరి వరుడు దగ్గరకు వెళ్లిన సచివాలయ ఉద్యోగి రాంబాబు తాను వధువు ప్రేమించుకుంటున్నామని, తమకు అడ్డు రావద్దని సదరు వరుడికి చెప్పి వచ్చాడు. దీంతో వరుడు పెళ్లి నో అనేశాడు. ఈ కారణంగానే వరుడి కుటుంబం వివాహాన్ని రద్దు చేసుకుంది.

చీపుర్లు, చెప్పులతో బాది పారేసిన మహిళలు
ఇక ఇదే విషయాన్ని వారు వధువు కుటుంబంతో చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన వధువు కుటుంబ సభ్యులు గ్రామ వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ రాంబాబుని పట్టుకుని చెప్పులు, చీపుర్లతో దేహ శుద్ధి చేశారు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చెయ్యటానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా అంటూ బాది పారేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి అప్పగించారు. తమ కుమార్తె వివాహాన్ని చెడగొట్టిన రాంబాబు పై కఠిన చర్యలు తీసుకోవాలని వధువు కుటుంబ సభ్యులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications