విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భీమిలి శివారులో పేకాట.. 22 మంది అరెస్ట్, 23 మొబైల్స్ సీజ్

|
Google Oneindia TeluguNews

పేకాటతో కొంపలు కొల్లేరు అవుతున్నాయి. కొందరు నష్టపోతున్నారు. లాభపడుతున్నది ఎవరో తెలియదు.. కానీ, నష్టం మాత్రం ఎక్కువే.. ఇల్లు, జాగ, పొలం.. ఏదీ ఉండటం లేదు. దీంతో పేకాట ఆడేవారిపై నిఘా ఉంటుంది. అందుకోసమే గ్రామాల్లో భయపడుతూ ఆడుతుంటారు. క్లబులలో మాత్రం యథేచ్చగా జరుగుతుంటాయి. అక్కడ ఇష్టరీతిన ఆడతారు. అయితే రిసార్టులలో కూడా ఆడేస్తున్నారు. పర్మిషన్ లేదని చెప్పినా వినిపించుకోవడం లేదు.

విశాఖ జిల్లా భీమిలి శివారులో గల ఓ రిసార్ట్‌లో కొంద‌రు పేకాట నిర్వహించారు. దీనిపై స‌మాచారం అందుకున్న స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు అక్క‌డ‌కు వెళ్లి దాడి చేశారు. పేకాడుతున్న 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద ఎత్తున న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది కార్లు, 23 సెల్‌ఫోన్లను కూడా సీజ్‌ చేశారు.

22 members arrest while they playing cards

అదుపులోకి తీసుకున్న వారిలో విశాఖ నగరానికి చెందిన ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. పేకాటరాయుళ్లు నగదుకు బదులు కాయిన్స్ కూడా వినియోగించినట్లు పోలీసులు చెప్పారు. మొత్తం డ‌బ్బే వాడితే దొరికిపోతామ‌న్న భ‌యంతో వాటికి బ‌దులుగా కాయిన్స్ వాడిన‌ట్లు వివ‌రించారు. ప్రముఖులకు సంబంధించి వివరాలు మాత్రం తెలియరాలేదు. వారిని కోర్టులో హాజరుపరుస్తారు. మేజిస్ట్రేట్ మందలించి.. జరిమానా కట్టమని వదిలేసే అవకాశం ఉంది.

పేకాటతో జీవితాలు ఛిద్రం అవుతాయి. వద్దు ఆడొద్దు అని చెప్పినా కొందరు వినిపించుకోవడం లేదు. మొండిగా వెళ్లడంతో లాభం లేకుండా పోయింది. దాడులు నిర్వహించి.. అరెస్ట్ చేసే వరకు దారితీసింది. వీరికి జరిగిన దాంతో అయినా మిగతా వారు మారతారెమో చూడాలీ. లేదంటే వారు కూడా భార్య పిల్లలను ఫణంగా పెట్టి పేకాటకు బానిసగా మారే ప్రమాదం ఉంది.

English summary
22 members arrest while they playing cards at vizag district bhimili.23 mobiles are seized.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X