రేపు సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన... ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

జాతీయ పార్టీ ప్రకటనకు ముందు తెలంగాణ సీఎం కెసిఆర్ వివిధ జిల్లాల పర్యటనలతో బిజీగా ఉన్నారు. నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తున్న కెసిఆర్ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని, స్వామి వారికి ఒక కేజీ 16 తులాల బంగారాన్ని సమర్పించారు. ఇక రేపు వరంగల్ జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. వరంగల్ జిల్లాలో నూతనంగా నిర్మించిన ప్రతిభ క్యాన్సర్ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తో పాటు మెడికల్ కళాశాలను ప్రారంభించనున్నారు.

కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటన.. షెడ్యూల్ ఇదే

కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటన.. షెడ్యూల్ ఇదే

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఉదయం 11 గంటల 15 నిమిషాలకు ములుగు రోడ్డు లో ఉన్న ప్రతిమ హాస్పిటల్ కు చేరుకుంటారు. ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మెడికల్ కళాశాలను ప్రారంభిస్తారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు.

ముఖ్యమంత్రి పర్యటన నేపధ్యంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ముఖ్యమంత్రి పర్యటన నేపధ్యంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

వరంగల్ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పర్యటన నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్ జిల్లా కలెక్టర్ బి. గోపి, హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తో కలిసి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ప్రతిమ హాస్పిటల్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులతో చర్చించారు.

సీఎం పర్యటన నేపధ్యంలో పార్టీ శ్రేణుల్లో జోష్

సీఎం పర్యటన నేపధ్యంలో పార్టీ శ్రేణుల్లో జోష్


ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లాలోని పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఏర్పాట్లలో పాల్గొంటున్నారు. త్వరలో కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ఉందన్న నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్పత్రిని ప్రారంభించిన తర్వాత ఆయన ఏం చెప్పబోతున్నారు అన్నదానిపై పార్టీ శ్రేణులలో సైతం ఆసక్తి నెలకొంది. దసరా పండుగ నాడు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటిస్తారని వార్తలు వస్తున్న తరుణంలో కేసీఆర్ పర్యటనలు ఆసక్తికరంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+