స్కూల్ పిల్లలతో కేసీఆర్ కు జై కొట్టించిన మంత్రి ఎర్రబెల్లి!!

తెలంగాణ రాష్ట్ర మాస్ మంత్రి అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్ పై తన వీర విధేయతను పదే పదే ప్రదర్శిస్తూనే ఉంటారు. ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ ను తెలంగాణ గాంధీ అని, తెలంగాణకే దేవుడని, ఆపద్బాంధవుడు అని, రైతు బాంధవుడు అని ఇలా రకరకాలుగా పొగుడుతూ ఉంటారు. ఏ మాత్రం అవకాశం దొరికినా, ఎక్కడికి వెళ్లినా కేసిఆర్ కు జై కొట్టించడం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అలవాటు.

ఇక తాజాగా మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా రాయపర్తిలోని కొత్తూరు గ్రామంలో ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాలల సముదాయాన్ని మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడత వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో ఒక కోటి 75 లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఆధునీకరణ పనులు చేపట్టారు. పాఠశాల భవనాలకు రంగులు వేయడంతో పాటు, గార్డెన్ ఏర్పాటు చేసి అన్ని హంగులు సమకూర్చారు. కంప్యూటర్లు, గ్రంథాలయం, ఆట స్థలం, టాయిలెట్స్, ఇలా పాఠశాల అద్భుతంగా తీర్చిదిద్దారు.

Minister Errabelli applauded KCR, and slogans jai kcr with school children in class room!!

దీంతో కొత్తూరు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన మంత్రి ఎర్రబెల్లి అక్కడ విద్యార్థులతో కలిసి హల్చల్ చేశారు. తరగతి గదిలో బెంచిపై కూర్చుని విద్యార్థులతో ముచ్చట పెట్టారు. విద్యార్థులతో మాట్లాడుతూ వారి మాటలకు సంబరపడ్డారు. ఇక సీఎం కేసీఆర్ గురించి పిల్లలకు సైతం చెప్పిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీ బడిని ఇంత బాగా చేసింది ఎవరో తెలుసా అంటూ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మీ బడిని అభివృద్ధి చేశాడని చెప్పిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంత బాగా అభివృద్ధి చేసిన కెసిఆర్ సార్ కి ఒకసారి జై కొడదామా అంటూ జై కేసీఆర్ అంటూ తరగతి గదిలోనే నినదించారు.

ఇక మంత్రి ఎర్రబెల్లితో పాటు విద్యార్థులు కూడా జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. దీంతో విద్యార్థులు కెసిఆర్ కు జై కొట్టడంపై మంత్రివర్యులు తెగ సంబరపడిపోయారు. విద్యార్థులతో పాటు కూర్చున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారితో కలిసి సెల్ఫీలు దిగారు. కాసేపు వారితో ఆటలాడారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పిల్లలందరినీ కుశల ప్రశ్నలు అడిగారు. ఇదంతా బాగానే ఉన్నా క్లాస్ రూమ్ లో జై కేసీఆర్ అంటూ నినాదాలు ఏమిటి అని ఇది విన్న వారంతా విస్తుబోతున్నారు. సీఎం కేసీఆర్ పై అభిమానం ఉండొచ్చు కానీ, మరీ ఇంతనా ఎర్రబెల్లి అంటూ మంత్రి తీరుపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+