ప్రీతి కేసు: పోలీసుల విచారణలో ర్యాగింగ్ చేశానని ఒప్పుకున్న సైఫ్? కోర్టులో పోలీసులకు చుక్కెదురు!!
ప్రీతి కేసులో కీలక అప్డేట్స్ వస్తున్నాయి. పోలీసుల విచారణలో ర్యాగింగ్ చేశానని సైఫ్ ఒప్పుకున్నట్టు సమాచారం. ఇక సైఫ్ మరో నాలుగురోజులు కస్టడీకి కోరిన పోలీసులకు కోర్టులో చుక్కెదురైంది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకతీయ మెడికల్ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి కేసులో తాజాగా మరో కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. సీనియర్ పి జి వైద్య విద్యార్థి సైఫ్ ప్రీతి ని ర్యాగింగ్ చేసినట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ప్రీతి మృతి కేసు పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న సమయంలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న అంశాలు అసలు ఏం జరిగింది అన్న ఉత్కంఠను ప్రతి ఒక్కరిలో కలిగిస్తుంది.

ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్ తో అనేక అనుమానాలు .. నోరు మెదపని పోలీసులు
సీనియర్ వేధింపులు తాళలేక ప్రీతి ఆత్మహత్యకు పాల్పడి, నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రీతి మృతి చెందిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ ప్రీతి మృతి కేసులో అనేక అనుమానాలు చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ప్రీతి కేసుకు సంబంధించి వచ్చిన టాక్సికాలజీ రిపోర్టులో ప్రీతి ఎటువంటి విష పదార్థాలు తీసుకోలేదని, ఆమె శరీర భాగాలలో, అవయవాలలో, రక్తంలో ఎందులోనూ విషపదార్థాలు లేవని రిపోర్టు తెలిపింది. ఇక ఈ క్రమంలో కేసు ఆత్మహత్యాయత్నం నుండి, అనుమానాస్పద మృతి కేసుగా మార్చనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అప్పటి నుండి ఇప్పటివరకు ఈ కేసులో ఏమి జరుగుతుంది అన్న అంశంలో పోలీసులు నోరు మెదపటం లేదు.

పోలీస్ కస్టడీలో సైఫ్ విచారణ సాగిందిలా
ఇదిలా ఉంటే నాలుగు రోజులపాటు ప్రీతి మృతి కేసు నిందితుడు సైఫ్ ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపారు. పోలీసులు విచారణలో సైఫ్ మొదట తాను ప్రీతిని ర్యాగింగ్ చేయలేదని, తను సీనియర్ కాబట్టి ఏదైనా తప్పు చేస్తున్న సమయంలో వృత్తిరీత్యా పొరపాట్లపై తప్పని చెప్పానే కానీ ర్యాగింగ్ కాదని వాదించారని సమాచారం. అయితే పోలీసులు వాట్సప్ చాటింగ్ లు బయటికి తీసి సైఫ్ ఉద్దేశపూర్వకంగానే ప్రీతిని ర్యాగింగ్ చేసినట్టు నిర్ధారించి ఆ కోణంలో అతనిని ప్రశ్నించారు.

ర్యాగింగ్ అంగీకరించిన సైఫ్ .. కోర్టులో పోలీసులకు చుక్కెదురు
ఇక ఇటీవల విచారణలో సైఫ్ ను దీనిపై ప్రశ్నించగా తాను ర్యాగింగ్ కు పాల్పడింది నిజమేనని సైఫ్ అంగీకరించినట్టుగా సమాచారం. తను ఈ విషయంలో ప్రీతి గురించి చాటింగ్ కూడా చేశానని ఒప్పుకున్నట్టు సమాచారం. పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు పోలీసులు కోర్టుకు సమర్పించిన కన్ఫెషన్ రిపోర్ట్ లో ఈ విషయాలను పేర్కొన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే నాలుగు రోజులు పాటు నిందితుడు సైఫ్ ను విచారించిన పోలీసులు మరో నాలుగు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై నిన్న విచారించిన కోర్టు పోలీసుల పిటిషన్ తిరస్కరించింది. దీంతో కోర్టులో పోలీసులకు చుక్కెదురైంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications