వరంగల్ నిట్ లో టెక్నికల్ ఫెస్ట్ టెక్నోజియాన్ 2024!!

NIT వరంగల్ యొక్క ప్రతిష్టాత్మక వార్షిక టెక్నికల్ ఫెస్ట్, Technozion, 2024 రేపటి నుండి జనవరి 21 వరకు మూడు రోజుల పాటు నిర్వహించబడుతుంది. 2006లో ప్రారంభమైన Technozion, యువతకు సాంకేతిక అభివృద్దిని అందించడంలో ముందంజలో ఉందని ఈ ఏడు కూడా టెక్నోజియాన్ సాగుతుందని NIT వరంగల్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి పేర్కొన్నారు.

ఈ ఫెస్ట్‌లో, వివిధ రాష్ట్రాల నుండి ఇంజనీరింగ్ విద్యార్థుల వినూత్న ఆలోచనలు, వారి సామర్థ్యాలను మరియు ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం కల్పించడానికి అనేక టాప్ క్లాస్ ఈవెంట్‌లు నిర్వహించబడతాయన్నారు. ఈ సంవత్సరం Technozion యొక్క థీమ్ INGENIOUS, ఇది ఇన్నోవేషన్‌ను సూచిస్తుందన్నారు.

Technical Fest Technozion 2024 in Warangal NIT

ఇది అన్వేషణ, సృజనాత్మకత మరియు సాంకేతిక పరివర్తన స్ఫూర్తిని తెలియజేస్తుందన్నారు. ఈ ఏడాది టెక్నోజియాన్‌ ముఖ్య అతిథిగా ప్రఖ్యాత ఏరోస్పేస్ మరియు మిస్సైల్ సైంటిస్ట్ ప్రొఫెసర్‌ శ్రీనివాసన్‌ సుందరరాజన్ హాజరు అవుతున్నారన్నారు. ప్రొఫెసర్‌ శ్రీనివాసన్‌ సుందరరాజన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌కు చెందిన బ్రహ్మోస్, అగ్ని, పృథ్వీ, ఆకాష్, నాగ్ మరియు త్రిశూల్ వంటి ప్రతిష్టాత్మక క్షిపణి వ్యవస్థలలో క్షిపణి రూపకల్పన, ఉత్పత్తి, అభివృద్ధి అన్ని దశలలో పనిచేశారన్నారు.

తను NIT Trichy డైరెక్టర్‌గా పనిచేశారని, NIT Trichyని మార్చడంలో కీలక పాత్ర పోషించారన్నారు. ప్రస్తుతం, ప్రొఫెసర్ సుందరరాజన్ ఉన్నత విద్య & రక్షణ ఏరోస్పేస్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ప్రకాష్ సంగం (CEO,REDBUS)డాక్టర్ T N సురేష్ కుమార్ (Scientist, ISRO), వంశీ కూరపాటి (INFLUENCER) వంటి వివిధ ముఖ్య వక్తలు విద్యార్థులకు వినూత్న నైపుణ్యాలను పెంపొందించడానికి వారి సాంకేతిక అవగాహనలను అందిస్తారని తెలిపారు .

టెక్నోజియాన్ లో భాగంగా జహాజ్, RC బగ్గీ, హోవర్ మానియా, Virtual Realty, డీబగ్గింగ్ మానియా మొదలైన స్పాట్‌లైట్ ఈవెంట్‌లు నిర్వహించబడతాయి. ఈ రెండు రోజుల్లో MATLAB, T-Works ద్వారా రాపిడ్ ప్రోటోటైపింగ్, Simulink master, innosearch. మొదలైన వాటిపై వర్క్‌షాప్‌లు ఉంటాయి. ప్రతి డిపార్ట్‌మెంట్ ఈ రెండు రోజులలో వివిధ సాంకేతిక కార్యక్రమాలు మరియు క్విజ్‌లు నిర్వహిస్తాయి.

Technozionలో దాదాపు 40 టెక్నికల్ ఈవెంట్‌లను నిర్వహించాలని ప్లాన్ చేశారు. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన స్పర్ధక్ బృందం వారి వాహన ప్రదర్శనను చేస్తుంది . వివిధ సంస్థలకు చెందిన విద్యార్థులు పాల్గొని తమ సాంకేతిక ఆవిష్కరణలను ప్రదర్శిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+