వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్ధుల ఆకర్షణ కోల్పోతున్న ఆస్ట్రేలియా

By Santaram
|
Google Oneindia TeluguNews

Australia
మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా దేశంలో చదివే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. విక్టోరియా రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఒకవైపు ఆస్ట్రేలియా డాలర్‌ విలువ పెరుగుతుండటం, ఇంకోవైపు దేశంలోని భారత విద్యార్థులపై దాడులు జరుగుతున్న తరుణంలో విడుదలైన అధికారిక గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో విద్యాభ్యాస వ్యయం అధికమవుతుండటంవల్ల ఉన్నత పాఠశాలల్లో విదేశీయుల సంఖ్య తగ్గిపోయే అవకాశముంది. విక్టోరియా హై స్కూళ్లలో విదేశీ విద్యార్థుల సంఖ్య నాలుగు శాతం పడిపోయిందని తాజా గణాంకాలు చెబుతున్నాయి.

ఆసియా ప్రాంతం, ముఖ్యంగా భారత విద్యార్థులపై అడ్డూ అదు పూలేని దాడుల ప్రభావం ఇప్పు డు ఆస్ట్రేలియాను కుదిపేస్తోంది. విదేశీ విద్యార్థులపై ఆధారపడిన రూ.19,200 కోట్ల (4 బిలియన్‌ డాలర్లు) విద్యా పరిశ్రమ పునాదు లు కంపిస్తున్నాయి. విదేశీ విద్యార్థుల సంఖ్య క్షీణిస్తుండటమే దీనికి కారణం. ప్రధానంగా ఆస్ట్రేలియా వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య బా గా తగ్గిపోయిందని ఇక్కడున్న ఆ దేశపు ఏజెంట్లు తెలుపుతున్నారు.

స్థానికుల దాడులు, బోగస్‌ కాలేజీల మూసివేత కారణంగా ఇంతవరకూ ఉన్నత విద్యా సంస్థలపై పడిన ప్రభావం..ఇప్పుడు విదేశీ హైస్కూల్‌ విద్యపైనా కనిపిస్తోం ది.ఇందుకోసం వచ్చే మొత్తం వి ద్యార్థుల్లో భారతీయులు సగటున 0.8 శాతంకాగా, విక్టోరియా ప్రాం తంలో ఇది బాగా ఎక్కువ. ఈ దెబ్బకు చైనానుంచి వచ్చి చదువుకునే వారి సంఖ్య కూడా బాగా పడిపోయిందని 'ది ఏజ్‌' పత్రిక రాసింది. జాతీయ స్థాయిలో హై స్కూల్‌ విద్య (విక్టోరియన్‌) పాఠశాలల ఎన్‌ రోల్‌ మెంట్‌ లో 7శాతం మేర తగ్గుదల ఉందని పేర్కొంది. మరో వైపు న్యూజిల్యాండ్ లో భారతీయ విద్యార్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X