వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డల్లస్ లో టిడిఎఫ్ బతుకమ్మ వేడుక

By Santaram
|
Google Oneindia TeluguNews

Bathukamma
డల్లస్: తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టిడిఎఫ్-యుఎస్ ఎ) డల్లస్ బృందం తానా, టాన్ టెక్స్ ల సహాయంతో "డల్లస్ ఫోర్ట్ వర్త్ బతుకమ్మ@ దసరా సంబరాలు" ఘనంగా నిర్వహించింది. ఆరు గంటలపాటు ఆత్మీయంగా సాగిన ఈ సంబరాలకు 3,500 మందికి పైగా హాజరయ్యారు. రంగు రంగుల బతుకమ్మలు అలరించాయి.

విశాలమైన వేదిక, ఆహ్లాదకరమైన వాతావరణం కార్యక్రమం ఘనంగా జరగడానికి దోహదపడ్డాయి. సాయంత్రం నాలుగున్నరకు కార్యక్రమం ప్రారంభమైంది. వందలాది మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యం చేశారు. కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి పురంధేశ్వరి ప్రత్యేక ఆహ్వానితురాలిగా వచ్చారు.

బతుకమ్మ ఉత్సవం ముగిసిన తర్వాత మహిళలు ఊరేగింపుగా వెళ్ళి బతుకమ్మలను నిమజ్జనం చేసి వచ్చారు. ఆ తర్వాత గౌరీదేవి ఆశీస్సులు పొందారు. ఆ వెంటనే దసరా, జమ్మి ఉత్సవం ఆరంభమైంది. జమ్మి పూజ, రథయాత్ర జరిగాయి. పూజ ముగిసిన తర్వాత తెలంగాణ వంటకాలైన గారెలు, పులిహోర, ఇతర వంటకాలతో 3,500 మందికి భోజనం పెట్టారు. ఏక్ నజర్, జనప్రియ, మయూరి రెస్టారెంట్, డిస్కవర్ ట్రావెల్, రెడ్డి న్యూమన్ పిసి, స్పైస్ ఇన్, రేడియో కృషి, పటేల్ బ్రదర్స్ వంటి స్పాన్సర్లు ముందుకు రావడంతో భోజనాలను ఉచితంగా పెట్టగలిగారు.

నిర్వాహకులు క్రికెట్ దసరా కప్ ని నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు, ఈ ఉత్సవానికి గాయకుడు గోరటి వెంకన్న సాంస్కృతిక అతిధిగా హాజరయ్యారు. చిన్న పిల్లలు జానపద గేయాలు, భక్తిగీతాలు పాడారు. స్ధానిక మహిళలు వేదిక ఎక్కి బతుకమ్మ ఆడడం అన్నిటికంటే హైలైట్ గా నిలిచింది. డాక్టర్ కస్తూరి ఇనగంటి, రంజిత్ వెరమళ్ళ, పవన్ నెల్లుట్ల, వెంకట్ ములకుట్ల, కరుణాకర్ రెడ్డి స్పాన్సర్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం విజయంవంతం కావడానికి 80 మంది వలంటీర్లు కఠోరంగా శ్రమించారు. నిర్వాహక కమిటీ సభ్యులు అనంత్ రెడ్డి పజ్జూర్, చంద్ర బందర్, జానకిరామ్ మందాడి, కల్వల రావ్, కరుణాకర్ దాసరి, రామ్ కాసర్ల, రవి వెనిశెట్టి, సతీష్ రెడ్డి, శ్యామ రుమాళ్ళ, శ్రీధర్ కొర్సపాటి, శ్రీనివాస్ గుర్రం, శ్రీనివాస్ కూతురు స్పాన్సర్లకు, వలంటీర్లకు ధన్యవాదాలు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X