కాలిఫోర్నియాలో గణతంత్ర వేడుకలు

టిసిఎ ఉపాధ్యక్షుడు భాస్కర్ మద్ది ఆహ్వానం పలికారు. టిసిఎ మాజీ చైర్మన్ విజయ్ చవ్వా, ప్రస్తుత అధ్యక్షుడు సైదేష్ అజ్జన్, అతిథి కళ్యాణ్ రామన్‌లతో కలిసి మహాత్మా గాంధీ చిత్రపటం వద్ద కైపా దీపాన్ని వెలిగించారు. విజయ్ చవ్వా కొత్త టిసిఎ కమిటీ సభ్యులను పరిచయం చేశారు. చైర్మన్‌గా బుచ్చన్న గాజుల, అధ్యక్షుడిగా సైదేష్ కుమార్ అజ్జన్, ఉపాధ్యక్షుడిగా భాస్కర్ మద్ది, కార్యదర్శిగా సుభాష్ చక్రవర్తి రవడ, సంయుక్త కార్యదర్శిగా రాజు యాసాల, కోశాధికారిగా బాలేశ్వర్ ఇంద్రపు, సాంస్కృతిక కార్యదర్శిగా అర్షద్ హుస్సేన్, సహ సాంస్కృతిక కార్యదర్శిగా చందు (చంద్రకళ) సిరందాస్ రెండేళ్ల పాటు కొనసాగుతారు.
అర్షద్ హుస్సేన్ దేశభక్తి గీతాలాపన ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. పేరిణి నృత్యకారుడు జి. రమేష్ శివతాండవం విశేషమైన ఆదరణ పొందింది. బేబీ ఆకాంక్ష పియోనో ప్రదర్శన, బేబీ సోహం ఇంద్రపు భారత మాతకు జేజేలు గేయాలాపన, హంసిని అజ్జన్, సోహం ఇంద్రపు తేనెల తేటల మాటలతో గేయాలాన అందరినీ ఆకట్టుకున్నాయి. శ్రావ్య చవ్వా, ఉమా చింతలపాటి అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించారు. శ్రీనివాస్ మనప్రగడతో కలిసి గిన్నీస్ ప్రపంచ రికార్డు నెలకొల్పిన సాయి మనప్రగడ తెలంగాణ జానపద గీతం పాడారు. భారత స్వాతంత్ర్య సమరయోధుల వేషాల్లో పిల్లలు ప్రదర్శన ఇస్తుండగా టిసిఎ సంయుక్త కార్యదర్సి రాజు యాసాల దేశభక్తి వీడియోను ప్రదర్శించారు.