వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఎపి అవతరణ దినోత్సవాలు అనైతికం'

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
యుకె, యూరోప్ తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టిడిఎఫ్) ఆంధ్రప్రదేశ్ అవతరరణ దినోత్సవాలను ఖండించింది. రాష్టంలోని సగం మంది విలీనాన్ని వ్యతిరేకిస్తూ, తెలంగాణకు అన్యాయం జరిగిందని భావిస్తున్న సమయంలో అవతరణ దినోత్సవాలకు పన్ను చెల్లింపుదారుల డబ్బును ఖర్చు చేయడం అనైతికమని ఫోరం అధ్యక్షుడు కమల్ ఓరుగంటి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కొంత మంది ప్రాణత్యాగాలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాలను అధికారికంగా జరపడం అనైతికం, అసమంజసమని ఆయన ఓ ప్రకటనలో అన్నారు.

తెలంగాణ (హైదరాబాద్)తో పొట్టి శ్రీరాములుకు ప్రత్యక్ష సంబంధం ఏమీ లేదని, అయినా అవతరణ దినోత్సవాలకు పొట్టి శ్రీరాములు పేరును వాడుకుంటున్నారని, పొట్టి శ్రీరాములు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి మాత్రమే ఆమరణ నిరాహార దీక్ష చేశారని ఆయన అన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలితంగా కర్నూలు రాజధానిగా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని ఆయన అన్నారు. ఆ తర్వాతనే తెలంగాణతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని ఆయన గుర్తు చేశారున.

వాస్తవాలు తెలిసి కూడా నవంబర్ 1వ తేదీకి పొట్టి శ్రీరాములు ఫొటోలు, పేరును వాడుకోవడ సరైంది కాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. చరిత్ర చరిత్రనే అని, అది మారదని వారిద్దరు గమనించడం అవసరమని ఆయన అన్నారు.

English summary
Telangana Development Forum UK & Europe condemns the celebrations on Nov-1st for the reason of Andhra Pradesh formation day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X