వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ద్వితీయ శ్రేణి తారలపైనే ఎన్నారైలకు మోజు, ఎందుకు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Jyothi
అమెరికాలోని తెలుగు సంఘాలు గతంలో తమ వేడుకలకు పెద్ద పెద్ద సినీ ఆర్టిస్టులను ఆహ్వానించేవి. అభిమానులకు, వారికి మధ్య ఓ వారిధిగా అవి నిలిచేవి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తరం మారింది, అభిరుచులు మారాయి. ప్రవర్తన, నడతలో తేడా వచ్చింది. అమెరికాలోని ఈ తరం ఎన్నారైలు ద్వితీయ శ్రేణి తారలపై మోజు పడుతున్నారు. దీని వెనక ఆంతర్యమేమిటో అందరికీ అర్థమైపోతుంది. హైదరాబాదుకు చెందిన ఓ ఆంగ్ల దినపత్రిక ఈ విషయంపై ఆసక్తికరమైన వార్తాకథనాన్ని ప్రచురించింది. ఎన్నారైలు సినీ రంగానికి చెందిన తమ అభిమాన తారల జాబితా ఇస్తారు. మూవీ ఆర్టిస్టు సంఘం (మా) ఈ పర్యటనలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తుంది. ఏడాదిలో కనీసం 200 మంది నటీనటులు ఈ పర్యటనలు చేస్తుంటారు. వారిలో చాలా మంది మళ్లీ మళ్లీ చోటు చేసుకుంటారు. దీంతో ప్రతిష్ట గంగపాలవుతోంది. ఓ కార్యక్రమానికి వెళ్లిన ఓ యాంకర్ కమ్ నటి 60 రోజుల పాటు కనిపించకుండా పోయింది. చిన్న చిన్న తారలు సంపన్నులైన ఎన్నారైల వెంట రోజుల తరబడి తిరిగి బహుమతులతో తిరిగి వస్తుంటారని ఆ పత్రిక రాసింది.

చిరంజీవి, నాగార్జున వంటి నటులు గానీ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి మాస్ హీరోలు గానీ ఎన్నారైల కంటికి ఆనడం లేదు. ఈ ఏడాది ఎన్నారై సంఘాలు వారిని ఆహ్వానించలేదు. అమెరికాలోని రెండు తెలుగు సంఘాల వేడుకలకు వెళ్లిన 200 మందికి పైగా తారల్లో పేరున్న హీరోయిన్ శ్రియా శరన్ ఒక్కతే. మిగతా వారంతా బి - గ్రేడ్, సి - గ్రేడ్ తారలే. హైదరాబాదులో వ్యభిచారం కేసులో పట్టుబడిన వర్ధమాన నటి జ్యోతి కూడా ఉంది. ఇందుకు కారణమేమిటో, ఇందులోని ఆంతర్యమేమిటో ఎవరికైనా ఇట్లే అర్థమై పోతుంది. ఈ ఏడాది ఆటా వేడుకలకు సినీ ప్రముఖుల్లో బాలకృష్ణ మాత్రమే వెళ్లాడు. ఆయన తన క్యాన్సర్ ఆస్పత్రికి 60 లక్షల రూపాయలు విరాళంగా తెచ్చుకున్నారు. నాట్స్ వేడుకలకు రామ్ చరణ్ తేజ్ హాజరయ్యాడు.

అమెరికాలోని తానా రెండుగా చీలిపోయింది. దాని నుంచి చీలినవారు నాట్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇవి రెండు ఇటీవల పోటాపోటీగా వేడుకలు నిర్వహించుకున్నాయి. వాటిని నడిపేవారు మారారు. ఐటి వృత్తినిపుణులు, ఇంజనీర్లు, ఇతరులు ఆ సంస్థలను నడుపుతున్నారు. ఎన్నారైలు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని సినీ ప్రముఖులు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో వాటికి వెళ్లడం మానుకున్నవారు కూడా ఉన్నారు.

English summary
There was a time when these associations would attract big names like Chiranjeevi and Nagarjuna, not anymore. Apparently, Mahesh Babu, Pawan Kalyan, Jr Ntr, Allu Arjun and Naga Chaitanya have all declined invites from the NRI organizers this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X