వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో భారత యువతి మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

USA
న్యూయార్క్: అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో జరిగిన బస్సు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని మరణించింది. ఈ ప్రమాదంలో38మంది ప్రయాణికులు గాయపడ్డారు. గురువారంనాడు షికాగో నుంచి కన్సాస్ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు టైర్ ఒకటి పేలింది. అదుపు తప్పిన బస్సు ఇల్లినాయిస్ అంతరాష్ట్ర వంతెన పిల్లర్‌ను ఢీకొట్టింది. దీంతో భారతదేశానికి చెందిన యువతి మరణించింది. 38 మంది గాయపడ్డారు. మృతురాలిని భారత్‌కు చెందిన అదితీ అవధ్(24)గా గుర్తించారు. ఈమె కొలంబియా యూనివర్సిటీలో విద్యార్థిని.

ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 64 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక బృందాలు నిచ్చెనలు వేసుకుని బస్సులోకి వెళ్లి ప్రయాణికులను కాపాడాయి. బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను వెలికి తీశాయి. పిల్లర్‌ను బస్సు ఢీకొట్టగానే ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా దద్ధరిల్లింది. ఏడ్పులు, పెడబొబ్బలు వినిపించాయి.

ఏం జరిగిందో తెలిసే లోపలే పెద్ద శబ్దమై బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు ఢీకొట్టడానికి గల కారణాలపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దర్యాప్తు చేస్తారని బస్సు కంపెనీ మెగాబస్ అధికార ప్రతినిధి చెప్పారు. ప్రయాణికుల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని అన్నారు.

గాయపడినవారిలో 33 మందిని అంబులెన్స్‌లో ఆస్పత్రులకు తరలించారు. హెలికాప్టర్‌లో ఇద్దరిని సెయింట్ లూయిస్ ఆస్పత్రికి, ముగ్గురిని స్ప్రింగ్‌ఫీల్డ్ ఆస్పత్రికి తరలించినట్లు కంపెనీ ప్రతినిధి చెప్పారు.

English summary
An Indian girl was killed and 38 people injured when a double decker bus apparently blew a tire, skidded and slammed into a pillar in the US state of Illinois. Illinois state police have identified the victim as Aditi Avhad, 24. Police said she was a native of India and was traveling to Columbia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X