• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూచిపూడిలో అదరగొట్టిన లాస్య

By Pratap
|
Google Oneindia TeluguNews
Laasya Gaddipati
డెన్వెర్: సెలవులు వచ్చాయంటే పిల్లలు టీవీ చూస్తూనో, ఆటలాడుతూనే కాలం గడిపేస్తుంటారు. కానీ పదేళ్ల చిన్నారి లాస్య గడ్డిపాటి అద్భుతం చేస్తోంది. ఈ నెల 13వ తేదీన డెన్వెర్‌లో లేక్‌వుడ్ సాంస్కృతిక కేంద్రంలో కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చింది. ప్రేక్షకులను తన నాట్యకౌశలంతో లాస్య లక్ష్మీ గడ్డపాటి అలరించింది.

రంగప్రవేశంతోనే ఆమె ప్రేక్షకులను అదరగొట్టడమే కాకుండా కూచిపూడి విశ్లేషకుల మన్ననలు అందుకుంది. తన హావభావాలతో, శరీర కదలికతలో గంటలకొద్దీ ఆమె ప్రేక్షకులను కట్టిపడేసింది. వాణీ పరాకుతో ప్రారంభమైన ఆమె నృత్యప్రదర్శన బ్రహ్మాంజలి, తాండవ నృత్యకారి గజాననలతో ఆమె నృత్యప్రదర్శన సాగింది. వెంపటి చినసత్యం ప్రవేశపెట్టిన సంప్రదాయాన్ని ఆమె అనుసరించింది. రాత్రిపూట లైవ్ ఆర్కెస్ట్రా సాగింది.

ప్రదర్శనకు సరిత బంగరాల నృత్యాలకు రూపకల్పన చేశారు. కొలువైతివా రంగస్వామి, బాలగోపాల తారంగం వంటి నృత్యప్రదర్శనలు లాస్య ప్రతిభతో అత్యంత ఆకర్షణీయంగా, కనులవిందుగా అలరించాయి. సంక్షిష్టమైన నృత్యరూపకాలను లాస్య అత్యంత సునాయసంగా, కళాత్మకంగా ప్రదర్శించింది. లాస్య ఇప్పటి వరకు 50కి పైగా ప్రదర్శనలు ఇచ్చింది. 2011 జాతీయ తానా సదస్సులో ఆమె ద్వితీయ బహుమతి సాధించింది. 2012లో గిన్నిస్ వరల్డ్ రికార్డు గుర్తించిన తృతీయ అంతర్జాతీయ కూచిపూడి ప్రదర్శన కూడా లాస్య ఇచ్చింది.

ముఖ్య అతిథిగా విచ్చేసిన సిలికానాంధ్ర చైర్మన్ ఆనంద్ కూచిభొట్ల లాస్యను ప్రశంసలతో ముంచెత్తారు. పదేళ్ల బాలిక అమెరికాలో రంగప్రవేశం ప్రదర్శించిన తీరు అద్భుతమని ఆయన అన్నారు., నాటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్యామా రెడ్డి, కొలోరాడో స్కూల్ ాఫ్ మెడిసిన్ న్యూరోలజీ ప్రొఫెసర్ డాక్టర్ మార్క్, కైస్ సాఫ్ట్‌వేర్ సిఇవో జ్యోతి రెడ్డి ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా హాజరయ్యారు. తాతనాయనమ్మలు బోస్, అరుణ గడ్డిపాటి, కుమార్ రాజా చౌదరి, సుశీల లాస్యకు ఆశీస్సులు అందించారు. లాస్య తల్లిదండ్రులు ప్రియా కొర్రపాటి, సుధీర్ గడ్డిపాటి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. లాస్య నృత్యప్రదర్శనలతో వివిధ సేవా కార్యక్రమాలకు వారు సహాయం అందిస్తున్నారు.

English summary
What would you normally expect from 10 year old child in her summer vacation? While most of them are busy watching TV or playing games on the iPad, Laasya Gaddipati, 10 year old girl did an amazing Kuchipudi dance performance at Lakewood cultural center, Denver on July 13, 2013.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X