వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదృశ్యమైన విద్యార్థి మరణించాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Wrongly identified suspect in Boston blast dead
బోస్టన్: చాలా రోజుల క్రితం అదృశ్యమైన భారత విద్యార్థి సునీల్ త్రిపాఠీ శవమై కనిపించాడు. బోస్టన్ పేలుళ్ల ఘటనలో అతని పాత్ర ఉండవచ్చుననే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌లో కొంత మంది పోస్టు చేసిన వ్యాఖ్యలు ఆ అనుమానాలకు తావిచ్చాయి. అయితే, అతని పాత్ర లేదని ఆ తర్వాత నిర్ధారించారు.

ఫోరెన్సిక్ డెంటల్ పరీక్షల తర్వాత శవం సునీల్ త్రిపాఠీదేనని తేల్చారు. అయితే, అతని మరణానికి కారణాలేమిటనేది ఇంకా తెలియలేదు. ఇండియన్ పాయింట్ పార్కు నీళ్లలో త్రిపాఠీ శవాన్ని బ్రౌన్ బృందం కనిపెట్టింది. త్రిపాఠీ మార్చి నెల మధ్యలో కనిపించకుండా పోయాడు. అతని కోసం బంధువులు గాలింపు చర్యలు చేట్టారు. అతను బ్రౌన్ విశ్వవిద్యాలయంలో చదువుతుండేవాడు.

ఈ నెల 23వ తేదీన సునీల్ త్రిపాఠీ మరణించినట్లు ధ్రువీకరించుకున్నారు. నెలకు పైగా తమ కమ్యూనిటీ సునీల్ త్రిపాఠీ కోసం నిరంతరం శ్రమించిందని, గాలింపులో త్రిపాఠీ కుటుంబానికి సహకరించిందని బ్రౌన్ విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ క్రిస్టినా పాక్స‌టన్ చెప్పారు. సునీల్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు.

త్రిపాఠీ మార్చి 16వ తేదీన క్యాంపస్ సమీపంలోని అపార్టుమెంటు నుంచి వెళ్లిుపోయాడు. తన వెంట వాల్లెట్, గుర్తింపు కార్డు, సైకిల్ వంటివి తీసుకుని వెళ్లలేదు. ఆ తర్వాత అతను తిరిగి రాలేదు. త్రిపాఠీ కోసం రోడ్ ఐలాండ్ ప్రొవిడెన్స్ పోలీసులు విస్తృతంగా గాలించారు. అతని మిత్రులు, కుటుంబ సభ్యులు కూడా గాలిస్తూ నగరమంతా పోస్టర్లు వేశారు, ఫేస్‌బుక్ పేజ్ తెరిచారు.

English summary
Sunil Tripathi, the missing Indian student who was wrongly associated with the blasts in Boston was found dead. The Brown University student's body was identified on Thursday morning through a forensic dental exam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X