యూఎస్ సర్జన్ జనరల్‌గా వివేక్ మూర్తి: భగవద్గీతపై ప్రమాణం

న్యూయార్క్: భారతీయ అమెరికన్‌ వివేక్ మూర్తి(37) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనాయంత్రాంగంలో యూఎస్ సర్జన్ జనరల్‌గా నియమితులయ్యారు. ప్రజారోగ్య రంగంలో అతిపిన్న వయస్సులో అమెరికా దేశపు 19వ సర్జన్ జనరల్ పదవిని చేపట్టి చరిత్ర సృష్టించారు.

వివేక్ మూర్తితో అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ గురువారం ప్రమాణం చేయించారు. యూఎస్ సర్జన్ జనరల్ పదవీతోపాటు వైస్ అడ్మిరల్ హోదా కూడా లభిస్తుంది. భారతీయుల పవిత్ర గ్రంథం భగవద్గీతపై ఆయన ప్రమాణం చేయడం విశేషం. ఇది తనకు లభించిన గొప్ప అవకాశమని, తన పై ఉంచిన బాధ్యతను విజయవంతంగా పూర్తిచేస్తానని ఆయన తెలిపారు.

Indian-American Vivek Murthy takes over as U.S. Surgeon-General

ఈ అవకాశాన్ని కల్పించిన బరాక్ ఒబామాకు కృతజ్ఞతలు అని వివేక్‌మూర్తి అన్నారు. కర్ణాటకలోని అతిసామాన్య రైతు కుటుంబంలో జన్మించిన తాను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉందని ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసిన ఆయన ప్రసంగంలో పేర్కొన్నారు. ఆయన హార్వర్డ్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, యేల్ యూనివర్సిటీ నుంచి వైద్యశాస్త్రంలో మాస్టర్ డిగ్రీని అందుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+