వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నారైల పెళ్లిళ్లు 48గంటల్లోపే రిజిష్టర్ చేసుకోవాలి: మేనకా గాంధీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రవాస భారతీయుల(ఎన్నారై) పెళ్లిళ్ల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎన్నారైతో పెళ్లి జరిగిన 48 గంటల్లో తప్పక రిజిస్టర్‌ చేయించాలనే నిబంధన తీసుకొచ్చింది. లేని పక్షంలో వారి వీసా, పాస్‌పోర్టు జారీని నిలిపేస్తామని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ బుధవారం స్పష్టం చేశారు. దీనికి ముందు ఎన్నారై పెళ్లి రిజిస్టర్‌కు నిర్దిష్ట కాల పరిమితి లేదు.

అయితే, ఎన్నారై పెళ్లిళ్ల వ్యవహారంలో వరకట్న వేధింపులు, మహిళల హత్యోదంతాలు ఇటీవల తరచూ చోటుచేసుకుంటున్నాయి. నిందితులపై మోపిన నేరం నిరూపించడానికి, వారిని విదేశాల నుంచి రప్పించడానికి న్యాయ పరమైన సమస్యలు అనేకం ఎదురవుతున్నాయి.

 All NRI marriages to be registered within 48 hours: Maneka Gandhi

48 గంటల్లో పెళ్లి రిజిస్టర్‌ చేయించడం ద్వారా కేంద్రం డాటాబేస్‌లోకి ఎన్నారై వివరాలు చేరుతాయి. తద్వారా భారత్‌కి వచ్చివెళ్లే ఎన్నారై కదలికలపై దృష్టి సారించవచ్చని మేనక తెలిపారు. వారిపై నిఘా ఉంచడం ద్వారా ఏదైనా నేరానికి పాల్పడి దేశం నుంచి పారిపోకుండా ఎన్నారైలను అడ్డుకోవచ్చని ఆమె అన్నారు.

వీసా, పాస్‌పోర్టును రద్దు చేసి నేర విచారణ చేపట్టొచ్చని వివరించారు. కాగా, తాజా నిర్ణయానికి ముందు ఎన్నారై పెళ్లిని 30 రోజులలోపు రిజిస్టర్‌ చేసేలా నిబంధన రూపొందించాలని 'లా కమిషన్‌' మహిళా, శిశు అభివృద్ధి శాఖకు సూచించడం గమనార్హం.

English summary
All NRI marriages solemnised in India would have to be registered within 48 hours, Union Minister of Women and Child Development (WCD) Maneka Gandhi said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X