ధూంధాంతో దద్దిరిల్లిన మిల్పిటాస్..

Subscribe to Oneindia Telugu

మిల్సిటాస్ (క్యాలిఫోర్నియా) : అమెరికా టీఆర్ఎస్ అధ్వర్యంలో తెలంగాణ ధూమ్ ధామ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని మిల్పిటాస్ నగరంలో తెలంగాణ సాంస్కృతిక, చారిత్రిక విశిష్టతను చాటేలా ఈ ధూమ్ ధామ్ కార్యక్రమం నిర్వహించారు.

భాస్కర్ మద్ది ఉపన్యాసం తో ప్రారంభమైన కార్యక్రమం.. ఆతర్వాత అభిలాష్ రంగినేని గారు అతిథులను స్వాగతించడం.. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి, మలి దశ ఉద్యమ సమయం లో కళాకారులు చేసిన సేవలను గుర్తుచేస్తూ సాగిన ఆయన ఉపన్యాసంతో ఆహాతులను ఆకట్టుకుంది.

TELANGANA DHOOM DHAAM in california milpitas community centre

అనంతరం ముఖ్య అతిధి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, మిల్పిటాస్ నగర మేయర్ హొసే ఎస్టీవ్స్, అప్లైడ్ మెటీరియల్స్ సీటీవో ఓం నలమసు, ఇండియన్ ఎంబసీ సాంస్కృతి విభాగం ఇంచార్జి వెంకట్ కూచిబొట్ల, TRS రాష్ట్ర నాయకులు విట్టల్ దండే గార్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాలు పంచుకున్నారు.

మొత్తంగా.. ఐదు గంటల పాటు ఆద్యాంతం ఆసక్తికరంగా కార్యక్రమం కొనసాగడం విశేషం. ఇక తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి ఆధ్వర్యంలోని సాంస్కృతిక కళాకారులు ఆట పాటతో వేదిక దద్దరిల్లింది.

TELANGANA DHOOM DHAAM in california milpitas community centre

అనంతరం అమెరికా టీఆర్ఎస్ నాయకులు విట్టల్ దండే మాట్లాడుతూ.. ప్రపంచీకరణ దృష్ట్యా యావత్ ప్రపంచం భారత దేశం వైపు చూస్తోందని, కెసిఆర్ గారినాయకత్వంలో భారత దేశం చూపంతా అభివృద్ధిపథంలో పరుగులిడుతున్న తెలంగాణ వైపే నిలిచిందన్నారు. కార్యక్రమంలో భాగంగా.. ప్రముఖ పేరిణి నాట్య కళాకారిణి శ్రీమతి చిన్మయి అరుకుల గారు త్రిపురాసుర సంహారంనాట్యంతో అందిరిని మంత్రముగ్ధులను చేసిండ్రు.

స్థానిక మిల్పిటాస్ ఐసీసీ లో జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు 800 పైగా ప్రజానీకం హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథిలును అమెరికా టీఆర్ఎస్ నేతలు ఘనంగా సత్కరించారు.

TELANGANA DHOOM DHAAM in california milpitas community centre

తెలంగాణ సాంస్కృతిక సంఘం,అమెరికన్ తెలంగాణ అసోసియేషన్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, విజన్ తెలంగాణ అసోసియేషన్, మౌంటెన్ హౌస్ ట్రేసీ తెలుగు అసోసియేషన్ మరియు వాలంటీర్ బృంద సభ్యులు నివేదిత,సాగర్ కొత్త, ప్రదీప్ కురుసల, దిలీప్ శ్యాసని, అభినవ్ నాగవరం, అజయ్ సాగి, ఫణి చొక్కాపు, యాశ్వంత్ రంగినేని, నిహాల్ గుడాల, హ్రితికేష్, శ్రీకాంత్ యాదవ్, రాజశేఖర్, పృథ్వీ,భార్గవ్, రాజేష్, మనోజ్,సంతోష్ బోయినపల్లి, భగత్, సతీష్ సహకారంతో ఈకార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TELANGANA DHOOM DHAAM was grandly held in california milpitas community centre. Telanganan cultural Chief Rasamayi Balakishan was the chief guest to the event

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి