వీసా మోసం: భారత దౌత్యాధికారిణి అరెస్ట్

భారత దేశం నుంచి వ్యక్తిగత సహాయకురాలిని తీసుకువచ్చే క్రమంలో వీసా కోసం పలు తప్పుడు పత్రాలు సమర్పించినట్లు ఆమెపై ఆరోపణలు రుజువు కావడంతో దేవయానిని గురువారం ఉదయం లా ఎన్ ఫోర్స్ మెంట్ ఉన్నతాధికారులు అరెస్ట్ చేసినట్లు ప్రీత్ భరార్ గురువారం తెలిపారు.
ఈ నేపథ్యంలో భారత దౌత్య కార్యాలయ అధికారులు అమెరికా ప్రభుత్వాన్ని సంప్రదించడంతో దేవయాని కోబ్రాగాడె శుక్రవారం జరిమానాను చెల్లించి విడుదలయ్యారు. దేవయానిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వాషింగ్టన్‌లోని భారతీయ దౌత్య కార్యాలయం ఇప్పటికే అమెరికా ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
న్యూయార్క్‌లోని భారతీయ దౌత్య కార్యాలయంలో డిప్యూటీ కాన్సల్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్న దేవయాని కోబ్రాగాడె, అమెరికాలో భారత రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, మహిళా విభాగాల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications