ఎన్ అరుణ ఆలాపన

మెత్తటి గాలి
ఖాళీ జ్ఞాపకాలను మోసుకొస్తుంది
నా చిన్నప్పటి రూపం
నా వెంట నడిచొస్తున్నట్టే వుంది
మెలుకువ
ఒక దీర్ఘరాత్రిగా మారింది
సముద్రంలో అల వెనక్కి పోయినట్లు
కాలం వెనక్కి వస్తే బాగుండు
నిన్నని రేపుగా చేసే ప్రయత్నంలో
నన్ను నేను
ఒక ఆయుధంగా మలుచుకుంటున్నాను
ఆ పొద్దు తిరుగుడు పూలన్నీ
సూర్యుడికి నిబద్దాలే
ఒక్కటి మాత్రం
ఏమయ్యిందో గాని
మొహం తిప్పుకుంది
ఇప్పుడది నా వైపు చూస్తుంది
కాబట్టి
అది నాదే












Click it and Unblock the Notifications