సూర్యుడు - చంద్రుడు

అంత దూరం నుంచి
దిగి వచ్చి
నాతో గరమ్ గరమ్ చాయ్ పంచుకొని
ఊదుకుంటూ ఊదుకుంటూ తాగాడు
తన కిరణాల కవిత్వాన్ని
సిక్స్‌టీన్ పాయింట్‌లో
డిటిపి కంపోజ్ చేయించి
ఆఫ్‌సెట్‌లో అచ్చు పోయించి
తనను
ప్రఖ్యాతుడిని లోక విఖ్యాతుడిని
చేయమని నా కాళ్లావేళ్లా పడి సూర్యుడు
మరీ మరీ బతిమాలాడు
చంద్రుడు కూడా నా దోస్తే
ఐస్ క్రీం తిన్నాం
చెరొకటీ
తారలతో మొహం మొత్తింది
సినిమా తారలను తనకు
పరిచయం చేయమని చంద్రుడు
నా ప్రాణం తీశాడు












Click it and Unblock the Notifications