ప్రభూ వీళ్ళేంచేస్తున్నారో

Vajjala Siva kumar
ఒకరు చచ్చి బతికి పోతారు
మరొకరు బతికుండి బయటపడుతారు

చేసుకున్నోడికి చేసుకున్నంత
నీళ్ళ అవసరాన్ని ఎరువుగా వేసుకుని
పదవిలో పాతుకుపోయిన అపర భగీరథుడు
ఎండమావుల్ని వరంగా ఇచ్చి
నాలుగు రోడ్ల కూడళ్ళలో
విగ్రహమై స్థిరపడతాడు

కన్నీళ్ళ కర్థం తెలియని
రాకుమారుడు ఓదార్పు శవాన్ని
భుజానేసుకొని పట్టువదలకుండా
వెనకేసుకున్న రాళ్ళ కథలో
దోషిగా దొరికిపోతాడు

ప్రశ్నలడగడానికి అలవాటుపడ్డ భేతాళుదు
డొంకలమూలాలు తెలిసినా
తీగలాగలేక డీలా పడిపోతాడు

దేన్నైనా కొనడానికి అలవాటుపడ్డ నైజం
న్యాయమ్మీద వేలంపాటకుదిగుతుంది
లొంగినోడికి లొంగినంత మహదేవ
ముడుపులు, ఒడుపులు ముడిసరుకౌతున్న విపణిలో
దేవుడా రక్షించు న్యాయాన్ని.

అక్రమార్కా ! అక్రమార్కా !
నీ ఓదార్పుకి మాతీర్పుతో
ఋణం తీర్చుకున్నాం
మార్గం ఏదైతేనేం అది అనితర సాధ్యం
నువ్వు తరలించింది మా కాళ్ళ కింది నేలే అని
నీ అవినీతి సామ్రాజ్యం కింద మా బతుకులే మూల్గుతున్నాయని
ఏ కోర్టులు చెపితే మాకేం
మాకు మాత్రం నువ్వే దేవుడివి
కత్తులతోనో కారుణ్యంతోనో
కాలాన్ని అణిచిపెట్టటం నీకు కేకుతో పెట్టిన విద్య
దేన్నైనా కొనడానికి అలవాటుపడ్డ దాహం నీది
దేన్నైనా అమ్మడానికి వెనుకాడని దేశం మనది

ప్రజాస్వామ్యం సాక్షిగా నోటిచ్చితే ఓటేసి
నీకు పట్టం కట్టడానికి ఈ గొర్రెపిల్లలు ఎప్పుడూ సిద్దమే
నీ మరో పెట్టుబళ్ళ బలికి మా మూగ నేలా సిద్దమే
తప్పును తప్పన్నందుకే జీసస్ ని శిలువేసి
మేకులు దిగేసిన లోకం
మరోసారి నేరానికి పట్టం కట్టె వెర్రిలో
కళ్ళు మూసుకుని పరిగెత్తుతుంది

ప్రభూ వీళ్ళేంచేస్తున్నారో
వీళ్ళకే తెలియదు
బిడ్డలారా నేరం కటకటాల్లో ఉందని ఏడవకండి
న్యాయం శాశ్వతంగా గుడ్డిదౌతుందని
మీకూ మీబిడ్డలకూ దక్కకుండా పోతుందని ఏడవండి

- వఝల శివకుమార్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+