'ఇలాగే..'

నా రెండు రెక్కలు తడిసి ముద్దయి
దేహం కన్నీటిపర్యంతమైంది
తలుచుకున్నప్పుడల్లా
రక్తం బొట్లు బొట్లుగా పడి
గుండె పిడచకట్టుకుపోతది
కన్నీరింకిపోయి కళ్ల ఎర్ర జీరలు కట్టినై..
ఏం చేస్తాం, బిడ్డా...
ప్రాణానికి ప్రాణం అడ్డమేసే దాకా నేనూ అమ్మా..
..... ..... ....
గాలి ఊపిరి బిగపడుతది
చెట్టు ఆకు ఊగదు
శిరీష పుష్పం రాలిపడుతది
మొక్కులు, మొత్తుకోళ్లు, ప్రతినలు
నినాదాలు మిన్నంటుతయి
తెలంగాణ అంగలారుస్తది
పీతిరి గద్దలు ఒక్కటొక్కటే వాలుతయి
ప్రాణాలకు ప్రాణాలు అడ్డేస్తమంటయి
పీక్కు తినేసి, బొర్రలు విరుచుకుని
చల్లటి గూళ్లల్ల వెచ్చగా నిద్రపోతయి
....... ...... .....
నెత్తి మీద కత్తుల కోలాటాలు
శివతాండవం అనుకుంటాం గానీ..
శిలువైపోయి, చిద్విలసిస్తడు
వెనక్కి రాలేం, ముందుకు తొవ్వ మూత
అడుగు పడదు, నడక సాగదు
బిడ్డా, ఇంత మాత్రానికే అంత ప్రాణమా..
జాబితా పెరుగుతుంది
- కాసుల ప్రతాపరెడ్డి












Click it and Unblock the Notifications