నెలవంక రాలిపడింది...

పాత బస్తీ గుర్తొచ్చినప్పుడు మనిషో
మనిషి గుర్తొచ్చినప్పుడు పాతబస్తీయో
గుర్తు వస్తూ ఉండేవి లేదా గుర్తు వస్తూ ఉండేవారు
ఇద్దరూ లేదా రెండూ గుర్తొచ్చినప్పుడు
కొత్త బస్తీకీ పాతబస్తికీ మద్యన పెనవేసిన బంధం
పురానా పూలో.. నయా పూలో గుర్తొచ్చేవి
పచ్చి పచ్చి ఇరవై నాటి గుర్తులు
గుండెను అప్పుడప్పుడూ తడుతుంటే
మనిషి గుర్తొచ్చేవాడు, ఆయనా గుర్తొచ్చేవాడు
మామూలుగా ఉంటూనే
పర్వతాన్నో.. పదింతల అధికారాన్నో
ఢీకొనడం చూసిందక్కడే
ఊరంతా ఓ వైపు వెళ్లిపోతుంటే..
బాజాలూ బజంత్రీలు మోగిస్తుంటే
సందు చేసుకుని ఏమీ ఎరగన్నట్లు
అంతా తెలిసీ వెళ్లిపోవడం కనిపించిందక్కడే..
సూర్యుడూ చంద్రుడూ కలగలిసిన ఆత్మనో రూపమో తెలియదు
అలా వెళ్లిపోవడం ఏమీ బాగా లేదంటే నవ్వుతాడేమో..
వంతెన తెగినట్లుగానే ఉంది..
నెలవంక రాలిపడినట్లుగానే ఉంది
పండ్ల సందుల్లోంచి...
తెల్లటి పైజామా, కుర్తాల్లా నవ్వు తెల్లగా మెరిసిపోతుంటే..
నీ నవ్వు కోసం నిరంతరం దేవులాడుతూ ఇలా...
కాసుల ప్రతాపరెడ్డి
(ఎంటి ఖాన్ మధ్య ఇంకా ఎక్కువగా తిరగాల్సి ఉండిందని అనుకుంటూ, తిరగాలని కోరుకుంటూ...)












Click it and Unblock the Notifications